Site icon HashtagU Telugu

Indira Mahila Shakti: రేపు పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇందిరా మహిళా శక్తి మిషన్- 2025 విడుదల

Indira Mahila Shakti

Indira Mahila Shakti

Indira Mahila Shakti: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రేపు పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇందిరా మహిళా శక్తి (Indira Mahila Shakti) మిషన్- 2025 విడుదల చేయ‌నున్నారు. ఈ ఏడాది మహిళా స్వయం సహాయక బృందాల విజయాలతో పాటు భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశిస్తూ ఇందిరా మహిళ శక్తి మిషన్ – 2025 విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మహిళల ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన, సంపద సృష్టిపై ప్ర‌భుత్వం ఫోక‌స్ పెట్టింది. ఐకమత్యమే మహాబలం అనే నానుడిని నిజం చేసేలా ఒకే గొడుగు కిందకు గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసింది. స్వయం సహాయక సంఘాల పరిధిని విస్తృతపరిచేలా సభ్యుల అర్హత వయసు పెంపు ప్ర‌క‌టించింది.

కిశోర బాలికలు, వయోవృద్ధుల ఆర్థిక భద్రత, సామాజిక మద్దతు కోసం నూతన స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారు. సభ్యుల కనీస వయస్సు 18 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గింపు, గరిష్ట వయసు 60 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెంచారు.

Also Read: Solar Manufacturing Project : తెలంగాణ నుండి ఏపీకి తరలిపోతున్న ప్రాజెక్టులు – కేటీఆర్

ఈ ఏడాది విజయాలు