Nitheesha Kandula : అమెరికాలో భారత విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. అక్కడ ఇండియన్ స్టూడెంట్స్ అనుమానాస్పద స్థితిలో మిస్సవుతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మే 30వ తేదీ నుంచి కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ బెర్నార్డినో నగరంలో 23 ఏళ్ల హైదరాబాద్ విద్యార్థిని నితీషా కందుల కనిపించడం లేదు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలోని చదువుతున్న నితీషా మిస్సయిందని, ఆమె ఆచూకీ గుర్తించాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. ఆమెను ఎవరైనా, ఎక్కడైనా చూస్తే వెంటనే తమకు సమాచారాన్ని అందించాలంటూ పోలీసులు ఓ ప్రకటనను విడుదల చేశారు. చివరిసారిగా నితీషా లాస్ ఏంజిల్స్ నగరంలో కనిపించిందని తెలుపుతూ పోలీసు అధికారి జాన్ గుట్టీరెజ్ ఆదివారం ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. (909) 537-5165, (909) 538-7777, (213) 485-2582 ఫోన్ నంబర్లలో నితీషా ఆచూకీపై సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. నితీషా కందుల 5 అడుగుల 6 అంగుళాల పొడవు, 160 పౌండ్ల (72.5 కిలోలు) బరువుతో నల్లటి జుట్టు, నల్లని కళ్లతో ఉన్నట్లు పోలీసులు ఈ ప్రకటనలో తెలిపారు. కాలిఫోర్నియా లైసెన్సు ప్లేటుతో ఉన్న 2021 మోడల్ టయోటా కరోలా కారును నితీషా(Nitheesha Kandula) నడిపేదన్నారు.
We’re now on WhatsApp. Click to Join
- గత నెలలో అమెరికాలోని చికాగో నగరంలో భారత విద్యార్థి రూపేష్ చంద్ర చింతకింది(26) కూడా మిస్సయ్యారు.
- హైదరాబాద్‌లోని నాచారానికి చెందిన మహ్మద్ అబ్దుల్ అర్ఫత్ అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ చేసేవారు. ఈ ఏడాది మార్చిలో ఆయన మిస్సయ్యారు. ఏప్రిల్ నెలలో క్లీవ్‌ల్యాండ్ నగరంలో మహ్మద్ అబ్దుల్ అర్ఫత్ శవమై కనిపించారు.
Also Read :Phones Vs Wallets : స్మార్ట్‌ఫోన్ బ్యాక్ కవర్‌లో ఆ కార్డులు ఉంచుతున్నారా ?.. బీ కేర్ ఫుల్!
- ఈ ఏడాది మార్చిలో భారత్‌కు చెందిన 34 ఏళ్ల శాస్త్రీయ నృత్యకారుడు అమర్‌నాథ్ ఘోష్ మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌లో హత్యకు గుర్యారు.
- అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న 23 ఏళ్ల భారతీయ విద్యార్థి సమీర్ కామత్ ఇండియానాలో ఈ ఏడాది ఫిబ్రవరి 5న శవమై కనిపించాడు.
- భారతీయ సంతతికి చెందిన 41 ఏళ్ల ఐటీ ఎగ్జిక్యూటివ్ వివేక్ తనేజా ఫిబ్రవరి 2న వాషింగ్టన్‌లోని ఒక రెస్టారెంట్ వెలుపల జరిగిన దాడిలో తీవ్ర గాయాలపాలయ్యారు.