Site icon HashtagU Telugu

BJP BC Atma Gourava Sabha: మోడీ నాయకత్వంలో భారత్ 30 ఏళ్ల ప్రగతిని సాధించింది: పవన్

Bjp Bc Atma Gourava Sabha

Bjp Bc Atma Gourava Sabha

BJP BC Atma Gourava Sabha: బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన బిసి ఆత్మగొరవ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించాడు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన ప్రసంగాల నుంచి స్ఫూర్తి పొందానని పవన్ అన్నారు. ప్రధాని పదవికి ఆయనే సరిపోతారని అప్పుడే నేను బలంగా నమ్మానని పవన్ తెలిపారు. మోదీ నాయకత్వంలో పదేళ్లలో భారతదేశం 30 ఏళ్ల ప్రగతిని సాధించిందని, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడం, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం, రామమందిర నిర్మాణం, డీమోనిటైజేషన్. వంటి మోదీ ప్రభుత్వ విజయాల గురించి పవన్ ప్రస్తావించారు.బీజేపీకి మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్ తెలంగాణకు బిసి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.

బహిరంగ సభకు హాజరుకావాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తనను ఆహ్వానించారని, ఆ ఆహ్వానాన్ని తాను అంగీకరించానని పవన్ ఇంతకుముందే చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగమైన జేఎస్పీ, కాషాయ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని నిర్ణయించింది.కాగా జేఎస్పీతో చేతులు కలపాలన్న పార్టీ నిర్ణయంపై పలువురు బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీ ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయలేదని అంటున్నారు.

Also Read: BC Atma Gourava Sabha : తెలంగాణ లో బిజెపి గెలిస్తే..బీసీ నేతే సీఎం – మోడీ