అయ్యప్పస్వాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ వ్యవహరం ముగిసిపోకముందే తాజాగా మరో ఆందోళన కొనసాగుతోంది. బాసర (Basara) సరస్వతీ దేవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రంజెర్ల రాజేష్‌పై ఆలయ పూజారులు, దుకాణదారులు, గ్రామస్తులు, హిందూ సంఘాలు నిరసనలకు దిగడంతో బాసరలో ఉద్రిక్తత నెలకొంది. సరస్వతీ దేవిని (Basara) కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రెంజర్ల రాజేష్‌పై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆలయ అర్చకులు, సిబ్బంది నిరసనకు (Protest) దిగారు. రాజేష్‌పై పీడీ యాక్ట్ పెట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు.
నిరసనకారులు రోడ్లపై రాస్తారోకోలు నిర్వహిస్తుండటంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రేంజర్ల రాజేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పటివరకు ఆందోళనలు కొనసాగిస్తామని హిందూ సంఘాలు చెబుతున్నాయి. బంద్ నేపథ్యంలో బాసరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు (Police) చర్యలు చేపట్టారు.
నిరసనకారులు ప్రశాంతంగా ఆందోళనలు చేసుకునేలా జాగ్రత్తలు చేపడుతున్నారు. బాసర (Basara) ద్ నేపథ్యంలో రేంజర్ల రాజేష్ దిష్టిబొమ్మను ఆందోళనకారులు దగ్ధం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన రేంజర్ల రాజేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అంతకుముందు బైరి నరేష్ కూడా అయ్యప్ప స్వామి మరియు ఇతర హిందూ దేవుళ్లపై కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యప్ప భక్తులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు.
Also Read : Hyderabad Metro: జీతాలు పెంచండి మహాప్రభో!