Site icon HashtagU Telugu

Minister Sridhar Babu: టెక్నాలజీ పరంగా ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తుంది: మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu

Minister Sridhar Babu

Minister Sridhar Babu: తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) టెక్నాల‌జీ రంగంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టెక్నాలజీ పరంగా ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తుందని ఆయ‌న చెప్పుకొచ్చారు. రూ. 350 కోట్లు ఫ్రీజ్ చేసి రూ. 183 కోట్లు భాదితులకు రిఫండ్ ఇవ్వడం ఒక రికార్డు అని ఆయ‌న అన్నారు. డిజిటల్ యుగంలో కొత్త అడుగులతో పాటు రిస్క్‌లు కూడా ఉంటాయ‌న్నారు. మనకంటే మన గురించి గూగుల్‌కే ఎక్కువ తెలుసు అని తెలిపారు.

ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, అఖరికి పవర్ గ్రిడ్ లోకి కూడా సైబర్ నేరగాళ్లు దూరారని మండిప‌డ్డారు. సైబర్ నేరస్తులు మన డబ్బులు మాత్రమే కాదు మన డేటా కూడా దొంగలిస్తున్నార‌ని గుర్తుచేశారు. ప్రతి ఏటా 10 ట్రిలియన్ రూపాయలు ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాల ద్వారా కాజేస్తునారని, రూ. 15వేల కోట్లు మన దేశంలో సైబర్ నేరగాళ్లు కొల్ల‌గొడుతున్నార‌ని లెక్క‌లు బ‌య‌ట‌పెట్టారు. త్వరలో తెలంగాణ కొత్త సెక్యూరిటీ పాల‌సీ ప్రకటిస్తామ‌న్నారు. సైబర్ డిఫెన్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని, సైబర్ చాలెంజ్ లను అధిగమించేందుకు షీల్డ్ కాంక్లెవ్ ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు.

Also Read: Ramzan Month: రంజాన్ మాసంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టండి: మంత్రి

నేరాల రూపం మారుతోంది: సీఎం రేవంత్‌

సమాజంలో నేరాల రూపం రోజురోజుకు మారుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. HICCలో నిర్వహించిన షీల్డ్-2025 కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘సైబర్ నేరాలు ఆర్థికవ్యవస్థపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. ఫేక్ న్యూస్ ప్రమాదకరంగా మారాయి. సైబర్ సేఫ్టీలో తెలంగాణను మొదటిస్థానంలో చూడాలి. 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్. ఇది 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలి’’ అని చెప్పారు.

సైబర్‌ నేరాల్లో సొమ్ము రికవరీల్లో సైబారాబాద్‌ పోలీసులు ముందంజలో ఉన్నారని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. సైబర్‌ నేరాలకు పరిష్కారాలను కనుగొనడమే లక్ష్యంగా హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ‘షీల్డ్‌ 2025’సదస్సులో ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణలో ప్రత్యేకమైన సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశామని.. సైబర్‌నేరాల దర్యాప్తు కోసం గతేడాది కొత్తగా 7 పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు.. ప్రపంచం వేగంగా మారుతోంది, నేరాల శైలి మారుతుదని వాఖ్యానించారు’’.