Site icon HashtagU Telugu

Telangana Tax Revenue : ఆగస్టులో రూ.13వేల కోట్లు.. తెలంగాణ పన్ను ఆదాయానికి రెక్కలు

Telangana Tax Revenue August 2024

Telangana Tax Revenue : ఆగస్టు నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆ నెలలో సర్కారుకు ఏకంగా రూ.13వేల కోట్ల పన్ను రాబడి వచ్చింది. అంతకుముందు నెల (జులై)లో పన్ను రాబడి రూ.10వేల కోట్ల లోపే ఉంది.  ఈమేరకు ఆదాయ, వ్యయ వివరాలతో కూడిన ఓ నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్‌)కు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో ఇప్పటిదాకా అత్యధిక పన్ను రాబడి ఆగస్టు నెలలోనే వచ్చిందని తెలిపింది.  జూన్‌లో రూ.12,190 కోట్లు, జులైలో రూ.9,965 కోట్లు మేర పన్నురాబడి వచ్చిన విషయాన్ని నివేదికలో ప్రస్తావించింది.  జులైతో పోలిస్తే ఆగస్టులో పన్ను రాబడి గణనీయంగా 30శాతానికిపైగా పెరిగిందని రాష్ట్ర సర్కారు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం(2024-25) మొదటి 5నెలల్లో (ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) రాష్ట్ర సర్కారుకు వచ్చిన మొత్తం పన్ను  రాబడి రూ.57,772 కోట్లు.  రాష్ట్ర బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఇది 35శాతం ఎక్కువే.

Also Read :Health Tips : సంతానలేమిని దూరం చేయడానికి ఈ కూరగాయను మించిన ఔషధం లేదు

Also Read :Secret of Colours : మీరు ధరించే దుస్తుల రంగు మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది..!