Site icon HashtagU Telugu

Telangana Police Department: ప్ర‌జ‌ల‌కు తెలంగాణ పోలీస్ శాఖ కీల‌క విజ్ఞ‌ప్తి!

Telangana Police Department

Telangana Police Department

Telangana Police Department: తెలంగాణ పోలీసులు (Telangana Police Department) ప్ర‌జ‌ల‌కు కీల‌క విజ్ఞ‌ప్తి చేశారు. అంతేకాకుండా ప‌లు విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో డిజిటిల్ అరెస్ట్, చైనా మంజాలు వాడ‌టం వ‌ల‌న న‌ష్టాలు, సైబ‌ర్ నేర‌గాళ్ల నంబ‌ర్ల నుంచి కాల్స్ వ‌స్తే ఏం చేయాల‌నే ప‌లు విష‌యాల‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలంగాణ పోలీస్ శాఖ పంచుకుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో డిజిటిల్ అరెస్ట్‌లు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ పోలీసులు ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అసలు డిజిటల్‌ అరెస్ట్‌ అనే పద్దతి లేదని గుర్తుంచుకోవాల‌ని పోలీసులు పేర్కొన్నారు. పోలీస్‌ యూనిఫాంలో ఎవరైనా వీడియో కాల్స్‌ చేస్తే.. అది ఖచ్చితంగా మోసమేన‌ని తెలిపారు. డిజిటల్‌ అరెస్ట్‌ స్కామ్‌పై మీ సన్నిహితులకు అవగాహన కల్పించాల‌ని సూచించారు. అలాగే పోలీస్ యూనిఫాంలో ఎవరైనా మీకు వీడియో కాల్స్‌ చేసి బెదిరిస్తే అది ఖచ్చితంగా సైబర్ మోసమే అని గ్ర‌హించాల‌ని సూచించారు. డిజిటల్ అరెస్ట్‌ అనే పద్దతి లేనే లేదు కాబట్టి అలాంటి కాల్స్‌కు స్పందించాల్సిన అవ‌స‌రం లేదన్నారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930కు ఫిర్యాదు చేయాల‌ని పేర్కొన్నారు.

చైనా మంజాల వాడ‌కాలు నిషేధం

చైనా మాంజాలు అమ్మడం తీవ్రమైన నేరమ‌ని తెలంగాణ పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే చైనా మాంజాలను వినియోగించవ‌ద్ద‌ని పేర్కొన్నారు. బాధ్యతగల పౌరులుగా మీరు కూడా చైనా మాంజాలు అమ్ముతున్నట్లు మీ దృష్టికి వస్తే వెంటనే 100కు ఫిర్యాదు చేయాల‌ని పిలుపునిచ్చారు.

Also Read: Allu Arjun: నేడు శ్రీతేజ్‌ను ప‌రామ‌ర్శించ‌నున్న అల్లు అర్జున్‌?

ఆ కాల్స్ ప‌ట్ల జాగ్ర‌త్త‌

అంతర్జాతీయ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాల‌ని అన్నారు. ముఖ్యంగా +97, +85 కోడ్స్‌తో ఫోన్లు వస్తే స్పందించకూడ‌ద‌ని పేర్కొన్నారు. ఆర్బీఐ, ట్రాయ్ పేరిట బెదిరిస్తూ జరుగుతున్న కొత్త తరహా మోసమిదని తెలిపారు. సైబర్ నేరాలపై ఇతరులకు అవగాహన కల్పించాల‌ని సూచించారు.