KCR : తెలంగాణ అనుభవించిన బాధ తలుచుకుంటే దుఃఖం వస్తుంది : కేసీఆర్

1999 కంటే ముందు తెలంగాణ అనుభవించిన బాధను తలుచుకుంటే దుఃఖం వస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.

  • Written By:
  • Updated On - June 2, 2024 / 01:35 PM IST

KCR : 1999 కంటే ముందు తెలంగాణ అనుభవించిన బాధను తలుచుకుంటే దుఃఖం వస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గతంలో తెలంగాణ కరువు కాటకాలకు, ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేదన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో దాస్యం ప్రణయ్ భాస్క ర్ అసెంబ్లీలో తెలంగాణ అంటే నాటి శాసనసభ స్పీకర్ తెలంగాణ పదం వాడొద్దని చెప్పారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఈ  కామెంట్స్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు  కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో బతుకమ్మ పండుగ అంటే మోటుగా మారింది.. అప్పట్లో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్,టీడీపీ
నాయకులు వాళ్ళ జిల్లాల గురించి కూడా మాట్లాడలేదు’’ అని ఆయన చెప్పారు.  ‘‘తెలంగాణలో ముల్కీ రూల్స్ అమలు అవుతాయని సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఆంధ్రాలో జై ఆంధ్రా ఉద్యమం వచ్చింది. వ్యూహాలు లేకపోవడంతో 1969 తెలంగాణ ఉద్యమం ఫెయిల్ అయింది. సుప్రీంకోర్టు తీర్పును కాలరాసి ముల్కీ రూల్స్ ను ఇందిరాగాంధీ రద్దు చేశారు’’అని కేసీఆర్ వివరించారు. కొంతమంది తమ చిల్లర రాజకీయాల కోసం అప్పట్లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసి మధ్యలోనే వదిలేశారని వ్యాఖ్యానించారు.

Also Read :Sonia Gandhi : ఇచ్చిన మాట నిలుపుకున్నాం.. తెలంగాణ ఏర్పాటు చేశాం : సోనియాగాంధీ

‘‘తెలంగాణ కోసం జయశంకర్ రాజీలేని పోరాటం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నుంచి ముగురు మాత్రమే ముఖ్యమంత్రులు అయ్యారు. వాళ్ళను మధ్యలోనే సీఎం పదవి నుంచి దించారు. చంద్రబాబు నాయుడు
సీఎంగా కేంద్రంలో చక్రం తిప్పుతుంటే నేను తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టాను. 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చాలా చిన్న విషయం’’ అని కేసీఆర్ తెలిపారు.

Also Read : Norway Chess 2024: నార్వే చెస్‌లో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. మెచ్చుకున్న అదానీ

‘‘మళ్లీ తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 105 సీట్లు వస్తాయి.  రైతు బంధు ఓట్ల కోసం ఇవ్వలేదు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కరెంటు కోతలకు హరీష్ రావు కారణమని రేవంత్ రెడ్డి పేలవంగా మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా ? హరీష్ రావు ముఖ్యమంత్రా ? అని గులాబీ బాస్ ప్రశ్నించారు.  కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ డౌన్ అయిందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ వాళ్లు ఎన్నికల్లో అర్రాస్ పాట పడినట్లు 4,000 పింఛన్ అని చెప్పి మాట తప్పారు’’ అని ఎద్దేవా చేశారు. ‘‘కల్లు డిపోల మీద దాడులు చేసి కల్లు గీత కార్మికులను ఇబ్బందులు పెడుతున్నారు. గొర్రెల స్కీంను బంద్ చేశారు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.