Site icon HashtagU Telugu

Harish Rao: కేసీఆర్ కిట్లు ఇస్తుంటే, కాంగ్రెస్, బీజేపీ తిట్లను ఇస్తోంది: హరీశ్ రావు

Harish Rao

Harish Rao

నేడు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో రెండో విడత డబుల్ బెడ్ రూంల పంపిణీ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ  మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ GHMC పరిధిలోని 9 నియోజకవర్గాలు కుత్బుల్లాపూర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, పటాన్ చెరు, మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాల పరిధిలో ఇండ్ల పంపిణీ చేశామని అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు 2లో 4800 మంది లబ్దిదారులకు ఇండ్లను కేటాయించినట్టు హరీశ్ రావు తెలిపారు.

కెసిఆర్ నాయకత్వంలో పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరుగుతుందనీ, ఎవరికి ఏ బ్లాక్ లో ఇల్లు వచ్చిందనేది కంప్యూటర్ ద్వారానే ఫైలింగ్ చేస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇల్లు కావాలంటే రూ.60 వేలకు లంచాలు అడిగేవారు అని, ఇళ్ళ కాగితాలు కూడా బ్యాంకు లో జప్తు పెట్టేటోళ్ళు అని హరీశ్ రావు ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి జనాలకు కిట్లు ఇస్తుంటే… కాంగ్రెస్, బీజేపీ తిట్లను ఇస్తున్నారని, 60 యేండ్లలో కాంగ్రెస్, టీడీపీ చేయని పనులు 10 ఏళ్ళ లో BRS సర్కారు చేసిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

‘‘రజినీకాంత్ హైదరాబాద్ వచ్చి… అమెరికా లో ఉన్నానా అన్నారు. రజినికి అర్థమైన అభివృద్ధి.. ఇక్కడున్న కాంగ్రెస్, బీజేపీ గజినీ లకు అర్థమైతలేదు. ప్రజలే Brs హైకమాండ్, ఒక్కొక్కరు ఒక్కో కెసిఆర్ కావాలి. కేసిఆర్ ఏం అభివృద్ధి చేసాడో మీరే మీ గల్లీలో చెప్పాలి. హైదరాబాద్ లో లక్ష ఇండ్లు ఇస్తున్నాం. 150 ఎకరాల్లో 16700 ఇండ్లు కొల్లూరులో ఇస్తున్నాం. సుప్రీం కోర్టులో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ పై వేసిన కేసులో ఆంధ్రప్రదేశ్ ఓడింది. తెలంగాణ ప్రభుత్వం గెలించింది’’ అని హరీశ్ రావు అన్నారు.

Also Read: Janhvi Kapoor: గోల్డ్ కలర్ శారీలో జాన్వీ.. చీరకట్టులోనూ అదిరిన అందాలు!

Exit mobile version