Site icon HashtagU Telugu

6128 Jobs : 6,128 బ్యాంకు జాబ్స్.. తెలంగాణ, ఏపీలోనూ వందలాది పోస్టులు

IBPS Clerk Jobs

6128 Jobs : వెయ్యి కాదు.. రెండు వేలు కాదు.. దాదాపు 6,128 గవర్నమెంట్ బ్యాంకు క్లర్క్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది.  ఈ జాబ్స్‌ను సాధించిన వారికి 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అపాయింట్మెంట్ లభిస్తుంది. ఈ బ్యాంకుల జాబితాలో.. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సిండికేట్‌ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ జాబ్స్‌లో 105 పోస్టులు(6128 Jobs) ఆంధ్రప్రదేశ్​లో, 104  పోస్టులు తెలంగాణాలో ఉన్నాయి. తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్‌లలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలులలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

డిగ్రీ పాసై, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగినవారు ఈ జాబ్స్‌కు అప్లై చేయొచ్చు. అయితే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. పలు కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. అప్లికేషన్ ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.850 పే చేయాలి. ఎక్స్​-సర్వీస్​మెన్​, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు రూ.175 కట్టాలి. అధికారిక వెబ్‌సైట్‌  https://www.ibps.in/ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ  జులై 1న ప్రారంభమైంది. దరఖాస్తులు సమర్పించడానికి లాస్ట్ డేట్ జులై 21. ఆగస్టు 12 నుంచి 17 వరకు ప్రీ-ఎగ్జామ్‌ ట్రైనింగ్‌ జరుగుతుంది. ఆగస్టు 24, 25, 31 తేదీల్లో ఆన్‌లైన్‌ ప్రిలిమిన‌రీ పరీక్షలు జరుగుతాయి. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు సెప్టెంబర్‌లో రిలీజ్ అవుతాయి. ఆన్‌లైన్‌ మెయిన్ పరీక్ష అక్టోబర్​ 13న జరుగుతుంది.

Also Read :Bhole Baba : ‘భోలే బాబా’ ఎవరు ? హాథ్రస్‌ తొక్కిసలాటలో 116 మంది మృతికి కారణమేంటి?

  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో తొలుత ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత మెయిన్స్ రాత పరీక్ష జరుగుతుంది.
  • ఈ పరీక్షల్లో వచ్చే మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్‌లలోనూ క్వాలిఫై అయ్యే వారికి జాబ్స్ ఇస్తారు.

Also Read : CM Revanth: స‌త్ప్ర‌వ‌ర్త‌న ఖైదీల‌కు సీఎం రేవంత్ క్ష‌మాభిక్ష‌