Site icon HashtagU Telugu

IAS Sandeep Kumar Jha: ఐఏఎస్ సందీప్ కుమార్ ఝా ‘వరకట్నం’ వేధింపులు.. కోర్టకెక్కిన భార్య!

Sandeep Kumar Jha

Sandeep Kumar Jha

కోర్బా జిల్లా సెషన్స్ కోర్టు 2014 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ సందీప్ కుమార్ ఝాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ సందీప్ కుమార్ ఝా నిజానికి బీహార్‌లోని దర్భంగా జిల్లా నివాసి. ఆయన భార్య గృహహింస, వరకట్న వేధింపులు, అసహజ శృంగారం లాంటి ఆరోపణలు చేస్తూ కోర్బా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఐఏఎస్ భార్య కోర్టును ఆశ్రయించింది. న్యాయవాది శివనారాయణ్ సోనీ ఈ విషయాన్ని న్యాయమూర్తి ముందు ఉంచారు. అనంతరం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.

“తనకు తెలంగాణ కేడర్‌కు చెందిన IAS అధికారి సందీప్‌తో 2021లో దర్భంగా బీహార్‌లో వివాహం జరిగింది. వివాహానికి ముందు, తరువాత నిరంతరం వరకట్నం కోసం వేధించేవాడని భార్య ఆరోపించారు. IAS భార్య కూడా భర్తపై ఆరోపణలు చేసింది. సందీప్ ఝా వరకట్న వేధింపులతో పాటు అసహజ సెక్స్ కు ప్రయత్నించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. కోర్బా నివాసి అమ్మాయికి 2021 సంవత్సరంలో IAS సందీప్ కుమార్ ఝాతో వివాహం జరిగింది. అప్పట్నుంచి వరకట్నం విషయంలో ఇబ్బందులకు గురిచేశాడు.

పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఐఏఎస్ కుటుంబం వరకట్నం డిమాండ్ చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గోద్రెజ్ కంపెనీకి చెందిన కనీసం 50 తులాల విలువైన నగదు, బంగారు, వెండి ఆభరణాలు, బ్రాండెడ్ బట్టలు, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, టీవీ, ఫర్నీచర్ వంటి వాటిపై భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై కోర్బా సివిల్ లైన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.

Also Read: Foreign Jobs: నర్సులకు గుడ్ న్యూస్.. విదేశాల్లో జాబ్స్ కోసం స్పెషల్ డ్రైవ్!