Site icon HashtagU Telugu

Smita Sabharwal: స్మితా సబర్వాల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ .. ఫొటోలు, వీడియోలు షేర్‌.. ఎందుకంటే?

Smita Sabharwal

Smita Sabharwal

Smita Sabharwal: తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. కొన్ని రోజుల పాటు నాకు సరైన పని దొరికింది అంటూ.. ఫొటోల‌ను వీడియోల‌ను షేర్ చేశారు. మిస్ వరల్డ్ – 2025 ఈవెంట్‌కు ఈసారి తెలంగాణ అతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ ఆధ్వ‌ర్యంలో మే 7వ తేదీనుంచి 13వ తేదీ వ‌ర‌కు హైద‌రాబాద్ వేదిక‌గా 72వ మిస్ వ‌ర‌ల్డ్ పోటీలు జ‌ర‌గ‌నున్నాయి.

Also Read: Renu Desai 2nd Marriage : రెండో పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే – రేణు దేశాయ్

మిస్ వ‌ర‌ల్డ్ ఈవెంట్‌కు సంబంధించిన ప్రారంభ వేడుక మే10న గ‌చ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జ‌రుగుతుంది. మిస్ వ‌ర‌ల్డ్ టాలెంట్ ఫినాలే మే22న శిల్ప‌క‌ళా వేదిక‌లో నిర్వ‌హించ‌నున్నారు. హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ ఫైనల్ మే 23న ఐఎస్‌బి (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్)లో జరుగుతుంది. మిస్ వరల్డ్ టాప్ మోడల్, ఫ్యాషన్ ఫినాలే మే 24న హైటెక్స్‌లో నిర్వహిస్తారు. గ్రాండ్ ఫినాలే తేదీ మే 31న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగుతుంది. అంతకు ముందు చౌమొహల్లా ప్యాలెస్‌లో మిస్ వరల్డ్2025 ఈవెంట్ కోసం వెల్‌కమ్ డిన్నర్ నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం స్మితా స‌బ‌ర్వాల్ సమీక్ష నిర్వహించారు.

Also Read: Donald Trump Tariffs : ట్రంప్ టారిఫ్‌లపై మోడీ ఎందుకు స్పందించడం లేదు..? – రాహుల్

అధికారుల‌తో తాను నిర్వ‌హించిన సమీక్షకు సంబంధించిన‌ ఫోటోలు, వీడియోలు ట్విట్టర్‌లో స్మితాస‌బ‌ర్వాల్ పంచుకున్నారు. కొన్నిరోజుల పాటు నాకు సరైన పని దొరికిందని భావిస్తున్నా.. వెల్‌కమ్ డిన్నర్ కోసం ఏర్పాట్లు జరుగుతన్నాయి. గ్రాండ్ ఓపెనింగ్ వేడుకకు కేవలం 30 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈవెంట్ సక్సెస్ చేసేందుకు మా బృందంలో అందరూ సిద్ధంగా ఉన్నారు. అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.