Site icon HashtagU Telugu

Caste Census Survey : కులగణన సర్వేకు నా వివరాలు ఇవ్వను – MLA పద్మారావు

Brs Mla Padma Rao

Brs Mla Padma Rao

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే (Caste Census Survey)తో ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో తెలియనప్పుడు వివరాలు ఇవ్వడం ఎందుకని సికింద్రాబాద్ BRS MLA పద్మారావు (BRS MLA Padma rao) ప్రశ్నించారు. ఈ సర్వేకు వివరాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు. ఈ సర్వే విషయంలో ఇంటికి వచ్చిన అధికారులకే స్పష్టత లేదని , ఒకవేళ ప్రజల వివరాలు కావాలంటే గతంలో చేసిన సర్వే డేటాను ప్రభుత్వం వాడుకోవచ్చని సూచించారు.

ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే మొదలైంది. ఈ సర్వేలో 75 ప్రశ్నలను అడగనున్నారు. అయితే సర్వేలో భాగంగా కుటుంబ ఫొటోలు ఏమీ తీయరు. ఎలాంటి పత్రాలు తీసుకోరు. ఇంట్లో అందరూ ఉండాల్సిన అవసరం కూడా లేదు. కుటుంబ యజమాని వివరాలు చెబితే సరిపోతుంది. కుటుంబీకుల్లో ఎవరైనా విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తే ఆ వివరాలు నమోదు చేస్తారు. ప్రజాప్రతినిధులు వారి ప్రస్తుత, పూర్వపు పదవీ వివరాలు చెప్పాలి. సమాచారం గోప్యంగా ఉంచుతారు.

కులగణన సర్వే సమయంలో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, ధరణి పట్టా పాస్ పుస్తకాలు, రేషన్ కార్డులు సిద్ధంగా ఉంచుకోవాలి. దీంతో సర్వే త్వరితగతిన పూర్తి చేయడానికి ఉపయోగ పడుతుంది. ఈరోజు నుంచి ఈ నెల 21 వరకు అధికారులు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేల్లో భాగంగా మొదటి 3 రోజులు ఇళ్లకు అధికారులు స్టిక్కర్‌ అంటించనున్నారు. అనంతరం మూడు రోజుల తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమగ్ర కుటుంబ సర్వే కోసం మొత్తం 75 ప్రశ్నలతో కూడిన వివరాలు సేకరించనున్నారు.

Read Also : PM Vidyalaxmi : ‘పీఎం – విద్యాలక్ష్మి’కి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఏమిటీ స్కీం ? ఎవరు అర్హులు ?