KTR Tweet: తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పరంగా దూసుకెళ్తుంటే ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వాటిపై విమర్శలు చేస్తోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన మహిళలకు ఫ్రీ బస్సు పథకంపై మొదటి నుంచి వివాదం నడుస్తూనే ఉంది. అయితే ఈ పథకంపై బీఆర్ఎస్ నేతలు పలు రకాలుగా విమర్శలు కురిపిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం అద్భుతమైనదని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అయితే తాజాగా కేటీఆర్ (KTR Tweet) ఉచిత బస్సు పథకంపై అలాగే అందులో ప్రయాణించే మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారాయి.
కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందన
ఉచిత బస్సు ప్రయాణంపై సెటైర్ వేయబోయి మహిళలపై అసభ్యకర కామెంట్స్ చేసిన కేటీఆర్ తన తప్పు తెలుసుకున్నారు. ‘‘నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా కామెంట్ చేశాను. వాటి వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్థాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నాకు అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’’ అని ట్వీట్ చేశారు.
Also Read: KTR : నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధానికి కాంగ్రెస్ పిలుపు ..
నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను ..
నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు.
— KTR (@KTRBRS) August 16, 2024
కేటీఆర్ ఏమన్నారంటే..?
ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు వేసుకోవచ్చు అంటూ మహిళల పట్ల కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మనిషికో బస్సు పెట్టండి. కుట్లు, అల్లికలు అవసరం అయితే డాన్స్‌లు, రికార్డింగ్ డాన్స్‌లు కూడా చేసుకుంటారు అంటూ మహిళలను అవమానించే విధంగా కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కేటీఆర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం
మహిళలపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించింది తెలంగాణ మహిళా కమిషన్. కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ మహిళా లోకాన్ని బాధ కలిగించే విధంగా ఉన్నాయి. దీన్ని మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారణ ప్రారంభించింది అంటూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదా ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశంపై నేడు కేటీఆర్ కు నోటీసులు అందే అవకాశం ఉందని సమాచారం.