MLA Danam Nagender: కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైడ్రా వల్ల తమకే నష్టమని అన్నారు. అలాగే కేటీఆర్‌కు క్లీన్ చిట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీకి ఈ ఫార్ములా మంచిదే అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాంగ్రెస్ హయాంలోనే పెరిగిందన్నారు. ఫార్ములా -ఈ రేసు వల్ల కూడా బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగిందని మరోసారి స్పష్టం చేశారు. ఫార్ములా- ఈ రేసును ప్రభుత్వం తప్పుపట్టడం లేదన్నారు. అందులోని ఆర్థిక లావాదేవీల విషయంలో క్విడ్ ప్రోకో జరిగిందని అనుమానం ఉందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేదని అన్నారు.
సీఎం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రైతు భరోసా జరిగినప్పుడు సంబురాలు చేయలేదు. ఉద్యోగ నియామక పత్రాలు అందించినప్పుడు సంబురాలు చేయలేదు. ప్రభుత్వ పథకాలను పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. సీఎంకు పాలాభిషేకం చేయడం లేదన్నారు. హైడ్రా వల్ల హైదరాబాద్ కు చాలా నష్టం జరుగుతుందన్నారు. మూసీ ఎప్పటికైనా ప్రక్షాళన చేయాల్సిందేనని అన్నారు. బీజేపీ వాళ్లు ఏసీలు పెట్టుకొని మూసీ పక్కన ఇళ్లలో పడుకున్నారు. బీజేపీ నాయకులు ప్రజలు ఎలా పడుకుంటే అలా పడుకుంటే చిత్తశుద్ధి ఉండేదన్నారు. కిషన్ రెడ్డి కొత్త ప్లేటు తీసుకుపోయి తిన్నాడు. ఈటెల రోజు వేపపుల్లతోనే పళ్లు తోముకుంటున్నాడా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి వల్ల ఫార్ములా ఈ రేసును ప్రభుత్వం రద్దు చేసింది. నేను ఫైటర్ ను, ఉప ఎన్నికలకు భయపడేది లేదని అన్నారు.
Also Read: Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం అందజేత
అయితే దానం నాగేందర్ ఇటీవల ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫార్ములా ఈ- రేసు పట్ల సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ ఫార్ములా వలన హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిందన్నారు. ఖైరతాబాద్ లోనే ఈ ఫార్ములా రేసు జరిగిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు అంటే తనకు గౌరవం ఉందన్నారు. అసెంబ్లీలో ఓ సారి కోపంతో మాట జారిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులకు, కేటీఆర్‌కు సారీ చెప్పినట్లు తెలిపారు. ఈ మాటలతో కాంగ్రెస్ కార్యకర్తలు దానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ కూడా నాగేందర్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.