Site icon HashtagU Telugu

KTR : హైడ్రా చర్యలు కేవలం పేదలు, మధ్యతరగతికే వారికైనా..?

Hydraa Ktr

Hydraa Ktr

మాజీ మంత్రి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR)..మరోసారి హైడ్రా (Hydraa) తీరుపై ట్విట్టర్ వేదికగా ఘాటైన విమర్శలు చేసారు. హైడ్రా తీసుకునే చర్యలు పేదలు, మధ్యతరగతికే వర్తిస్తాయా ..? ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌, హెచ్‌ఎఫ్‌ఎల్‌.. పేదలు, మధ్యతరగతి వర్గాలకే పరిమితామా ..? ధనవంతులు, బడాబాబుల మినహాయింపా..? అని ప్రశ్నించారు. హైడ్రా తీరు మొదటి నుండి విమర్శలకు దారితీస్తున్న సంగతి తెలిసిందే.

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపేలా హైడ్రా ను తీసుకొచ్చామని , అక్రమంగా కట్టడాలు చేపట్టిన వారిని ఎవర్ని వదిలిపెట్టమని భారీ సినిమా డైలాగ్స్ చెప్పిన సర్కార్..ఆ తర్వాత బడాబాబులు వదిలిపెట్టి , పేదవారిపై పడ్డారు. ఇప్పటికే వేలాది పెదాలు ఇల్లు కూల్చేశారు..ప్రభుత్వ అనుమతులు ఉన్నప్పటికీ కూల్చేశారు. దీనిపై హైకోర్టు కోర్ట్ సైతం హైడ్రా పై ఆగ్రహం వ్యక్తం చేయడం తో కాస్త సైలెంట్ అయ్యింది.

ఈ క్రమంలో హైడ్రా తీరు పై మరోసారి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. మూసీ సుందరీకరణ పేరుతో రివర్‌బెడ్‌లో ఉన్న ఇండ్లను ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే నార్సింగి ప్రాంతంలో ఆదిత్య బిల్డర్స్ సంస్థ మూసి నదిలో నిర్మాణాలను చేపడుతున్నదని బాల్క సుమన్‌ ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పేరుతో పేద, మధ్య తరగతి ప్రజలు జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడా నంస్థల నిర్మాణాల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. దానిని కేటీఆర్‌ రీట్వీట్‌ చేస్తూ ధనవంతులు, పెద్దవాళ్లకు మినహాయింపు ఉంటుందేమోనంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Read Also : KTR : బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీస్