రేవంత్ తీసుకొచ్చిన హైడ్రా (Hydraa) ..ఇప్పుడు హైదరాబాద్ (Hyderabad) లోనే కాదు పట్టణాల్లో కూడా హడలెత్తిస్తోంది. అన్ని పర్మిషన్లు ఉన్నప్పటికీ కూల్చేస్తుంది. ఇప్పటికే పలు పట్టణాల్లో బుల్లడోజర్స్ పేదల ఇళ్లపై పడగ..తాజాగా నాగార్జున సాగర్ లో హడావిడి మొదలుపెట్టాయి. నాగార్జున సాగర్‌లో(Nagarjuna Sagar )మున్సిపల్ అధికారులు ముడావత్ లక్ష్మణ్ అనే వ్యక్తి ఇంటిపై 20 మంది సిబ్బందిని తీసుకొని ఇంటిని కూల్చివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ ఇంటిని ఎందుకు కూల్చేస్తున్నారు అంటూ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తమ జాగాలో నిర్మించుకుంటున్న ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేయడం అమానుషమని వారు వాపోయారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేయడం చేతకాక హైడ్రా పేరుతో పేద ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. అత్యుత్సాహం చూపిస్తూ ఎలాంటి సమాచారం లేకుండా తమ సిబ్బందితో వచ్చి ఇంటిని కూల్చివేయం ఆమానుషమని , రేవంత్ రెడ్డి సర్కార్ పేదల కడుపు కొడుతున్నదని మండిపడ్డారు. మరోవైపు మూసీ బాధితులు కూడా రేవంత్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రిగానే మాట్లాడుతున్నాడా అని మండిపడుతున్నారు. లక్ష మంది మూసీ బాధితులం జేసీబీలు తీసుకొని రేవంత్ రెడ్డి ఇంటికి మీదకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు.
Read Also : CM Chandrababu : లడ్డూ వివాదం..సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన సీఎం చంద్రబాబు