ప్రజల్లో వ్యతిరేకతతో హైడ్రా (Hydraa) కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అక్రమ నిర్మాణాలు , చెరువుల కబ్జాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశ్యంతో రేవంత్ సర్కార్ ‘హైడ్రా’ వ్యవస్థను ఏర్పాటు చేసింది. హైడ్రా రావడం రావడమే..సినీ నటుడు నాగార్జున కు సంబదించిన N కన్వెన్షన్ కూల్చడం తో సామాన్య ప్రజల్లోనూ హైడ్రా ఫై నమ్మకం ఏర్పడింది. హైడ్రా ముందు రాజకీయ నేతలు , బిజినెస్ , సినీ ప్రముఖులు ఇలా అంత సమానమే అనే భావన ప్రజల్లో నెలకొంది. ఇది ముందు…ఆ తర్వాత హైడ్రా తీరు మారింది. బడాబాబులు , రాజకీయ నేతలను వదిలిపెట్టి సామాన్య ప్రజల ఇళ్లపై బుల్లడోజర్స్ పంపడం మొదలుపెట్టారు.
ప్రభుత్వ పర్మిషన్ , GHMC అనుమతి ఇలా అన్ని ఉన్నప్పటికీ కూల్చివేతలు చేయడం సామాన్య ప్రజల్లో ఆగ్రహం నింపింది. ఒక్కసారిగా ప్రభుత్వం ఫై వ్యతిరేకత పెరిగింది. నగర వ్యాప్తంగా ఎక్కడిక్కడే రేవంత్ సర్కార్ ఫై నిప్పులు చెరుగుతూ, తిట్లదండకం మొదలుపెట్టారు. కొన్ని చోట్ల హైడ్రా కూల్చివేతల భయంతో గుండెలు ఆగిపోయాయి. కాంగ్రెస్ నేతలు కనిపిస్తే కొడతాం అంటూ బహిరంగానే హెచ్చరిస్తున్నారు. విపక్షాలు సైతం కాంగ్రెస్ సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది మంచి పద్ధతి కాదని హితవు పలుకుతూ వచ్చారు. అటు హైకోర్టు సైతం హైడ్రా ఫై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు హైడ్రా కమిషనర్ కోర్ట్ లో హాజరు కావాలంటూ నోటీసులు సైతం జారీ చేసింది. హైడ్రా బాధితులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా ధర్నాలు చేయడం , ఆందోళనలు చేయడం మొదలుపెట్టారు. ఇలా నగరవ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ఫై వ్యతిరేకత వస్తున్న క్రమంలో హైడ్రా దూకుడు ను తగ్గించాలని సూచించినట్లు తెలుస్తుంది. దీంతో కూల్చి వేత్తలకు బ్రేక్ ఇవ్వాలని , అలాగే మూసి సర్వే ను కూడా ఆపేసినట్లు తెలుస్తుంది.
Read Also : Irans Supreme Leader : ఇజ్రాయెల్ భయం.. రహస్య ప్రాంతానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ