Site icon HashtagU Telugu

Hyderabad : అనుమతులు లేని హోర్డింగులను తొలగిస్తున్న హైడ్రా

Hydra removing illegal hoardings

Hydra removing illegal hoardings

Hyderabad : హైదరాబాద్ నగరంలో అనుమతులు లేని హోర్డింగులపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. శివారు మున్సిపాలిటీలైన శంషాబాద్‌, కొత్వాల్‌గూడ, నార్సింగి, తొండుపల్లి, గొల్లపల్లి రోడ్డు, తెల్లాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఇప్పటి వరకు 53 భారీ హోర్డింగ్‌లను హైడ్రా సిబ్బంది తొలగించారు. మరో వైపు యాడ్‌ ఏజెన్సీ ప్రతినిధులతో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సమావేశమయ్యారు. అనుమతిలేని హోర్డింగ్‌లను తొలగిస్తామని హెచ్చరించారు.

Read Also: Self Cleaning Cloth: సెల్ఫ్ క్లీనింగ్ క్లాత్ వచ్చేసింది.. అత్యంత చలిలోనూ ఇక బేఫికర్

సాధారణంగా వ్యాపారాలు నిర్వహించే వారు, పబ్లిసిటీ కోసం హోర్డింగులను ఏర్పాటు చేస్తారు. ఆ హోర్డింగ్ ల ఏర్పాటుకు సంబంధిత అధికారుల వద్ద అనుమతులు తప్పక తీసుకోవాలి. ఏ హోర్డింగ్ ఏర్పాటు చేస్తున్నారు? ఎంత సైజు హోర్డింగ్? ప్రజలకు ఇబ్బంది కలుగుతుందా అనే కోణంలో ఆలోచించి అధికారులు, హోర్డింగ్స్ ఏర్పాటుకు అనుమతులు ఇస్తారు. అయితే ఇవేమీ పట్టకుండా ఇష్టారీతిన హోర్డింగ్స్ ఏర్పాటు చేయడంతో వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. అందుకే హైడ్రా వీటి తొలగింపుకు శ్రీకారం చుట్టింది.

కాగా, నగరంలో అనుమతుల్లేని హోర్డింగ్ లపై హైడ్రా దృష్టి సారించిందని చెప్పవచ్చు. హైడ్రా చేపట్టిన ఈ చర్యకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో హైడ్రా.. ఏయే అంశాలపై దృష్టి సారిస్తుందోనని చర్చ సాగుతోంది. ఓ వైపు ఆక్రమణల గుర్తింపు, మరోవైపు తొలగింపు కార్యక్రమాన్ని వేగవంతం చేసిన హైడ్రా.. హోర్డింగ్స్ పై కూడ దృష్టి సారించి హైడ్రా అధికారులు బిజీ అయ్యారని చెప్పవచ్చు.

Read Also: CM Chandrababu: 2027 జూన్ లక్ష్యంగానే పోలవరం పనులు జరగాలి: సీఎం చంద్రబాబు