హైదరాబాద్ (Hyderabad) నగరంలో ప్రభుత్వ భూములు, చెరువులు, పేదల ఇళ్ల స్థలాలు, పార్కులు, రహదారులపై అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న వారిపై హైడ్రా (HYDRA) అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. అక్రమ నిర్మాణాలే కాకుండా చెరువుల్లో వ్యర్థాలను పడేసే నిర్వాహకులపైనా కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఈ నెల 8వ తేదీన బుద్ధభవన్ సమీపంలోని హైడ్రా ప్రధాన కార్యాలయం పక్కనే ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ తెలిపారు. దీని ద్వారా నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేసి, నిందితులను జైలుకు పంపే ప్రక్రియ వేగవంతం కానుంది.
Weekly Horoscope : వారఫలాలు.. మే 5 నుంచి మే 11 వరకు రాశిఫలాలను తెలుసుకోండి
ఇప్పటికే వందల ఎకరాల ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, నాలాలను రక్షించడంలో హైడ్రా కీలకంగా వ్యవహరించింది. ప్రస్తుతం వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న 50కి పైగా ఆక్రమణల కేసులను కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రత్యేక స్టేషన్‌కి బదిలీ చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా వచ్చే ఫిర్యాదులనూ అక్కడే స్వీకరిస్తారు. ఈ ప్రత్యేక స్టేషన్‌లో ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12 మంది ఎస్‌ఐలు, 60 మంది కానిస్టేబుళ్లను నియమించనున్నారు. ఫిర్యాదుల సంఖ్య పెరిగితే, మరిన్ని స్టేషన్లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు.
Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌తో జైలులో ప్రధాని, ఆర్మీ చీఫ్ భేటీ.. డీల్ ఫిక్స్ ?
చెరువుల ఆక్రమణ సాధారణంగా వ్యర్థాల డంపింగ్‌తో ప్రారంభమవుతుందని, సెల్లార్ తవ్వకాల మట్టి, కూలిన భవనాల వ్యర్థాలతో చెరువులను నింపి ఇళ్లు నిర్మించి అమ్మే అక్రమాలు ఎక్కువయ్యాయని రంగనాథ్ తెలిపారు. గతంలో పోలీస్ శాఖ డ్రైవర్లపై మాత్రమే కేసులు నమోదు చేసిందని, కానీ హైడ్రా అసలు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోనుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు నకిలీ పత్రాలు సృష్టించే అధికారులు, సిబ్బంది, భూమి మాఫియాపై కఠినంగా వ్యవహరించేందుకు హైడ్రా సిద్ధమైందని అన్నారు.