Hydra: హైడ్రా కార్యాలయంలో ఈరోజు కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. 2024 జూలై 19వ తేదీన హైడ్రా ఆవిర్భవించిందని అన్నారు. హైడ్రా 5 నెలల పని తీరు, వచ్చే ఏడాది కార్యాచరణను ప్రకటిస్తున్నామని రంగనాధ్ తెలిపారు. 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో హైడ్రా పని చేస్తుందని తెలిపారు. ఇక హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రి ఉంటారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కూడా సిద్ధం అవుతున్నాం. మా పరిధిలో 1025 చెరువులను గుర్తించాము. సర్వే ఆఫ్ ఇండియా నుండి ఇమేజ్ రికార్డులు సేకరించాము. శాటిలైట్ ఆధారంగా సేకరించిన డేటా కూడా మా వద్ద ఉంది. చెరువులు నింపి FTL పరిధి మార్చినా కూడా వాటిని గుర్చించేదుకు పని చేస్తున్నాం.
హైడ్రా కేవలం డిమాలేషన్ కోసమే అన్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైడ్రా చేరువులు పునరుద్ధరణ చేస్తుందని త్వరలోనే నిరూపిస్తాం. 72 DRF టీమ్ లు అందుబాటులోకి రాబోతున్నాయి. శాటిలైట్ ఏజెన్సీ లతో కూడా సమావేశం అవుతున్నాం. సమూహంగా ఇచ్చే ఫిర్యాదులను ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గతంలో ఎలా ఉండేది అనేది గుర్తిస్తున్నాం..అన్నారు. 72 DRF టీమ్ లు అందుబాటులోకి రాబోతున్నాయి. చెట్లు పడిపోవడం, నీళ్ళు నిలవడం, ఫైర్ ఆక్సిడెంట్లు పై DRF పని చేస్తుంది. త్వరలో మాకు వెదర్ రాడార్ రాబోతుంది అని రంగనాథ్ పేర్కొన్నారు.
ఇళ్ళు, ప్లాట్స్ కోనే వారి కోసం బఫర్, FTL లో ఉన్నాయా లేవా చెప్పేందుకు హైడ్రా ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేస్తాం. అయితే జూలై 19 కు ముందు కట్టిన వాటిని హైడ్రా కూల్చదు. పర్మిషన్ లేకుంటే కూల్చివేస్తాం. హైడ్రా కోసం ఒక FM రేడియో స్టేషన్ పెట్టాలని ఆలోచన చేస్తున్నాం అని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నోటరీ ఉన్న భూములు కొనెప్పుడు ప్రజలు ఆలోచించాలి. రెండు మూడు రకాలుగా వెరిఫై చేసి కోణాలని ప్రజలను మా విజ్ఞప్తి. అనుమతి లేని నిర్మాణాల్లో బిజినెస్ చేసేవాళ్ళు.. నోటీస్ ఇచ్చిన వెంటనే కాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలి. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఎక్కడా దెబ్బ తినడం లేదు. గతంలో FTL లో నిర్మించిన వాటిని హైడ్రా కూల్చదని చెప్పాము. అక్కడ నిర్మాణాల్లో ఉన్నోళ్ళకు ఇంకెవ్వరూ నిర్మాణాలు. చేపట్టకుండా చూసుకోవాలని చెప్పాము.
పేద వారి నీ ముందు పెట్టీ కొందరు బడా బాబులు వెనకాల ఉండి నడిపిస్తున్నారు అని కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 200 ఎకరాలు హైడ్రా కాపాడింది. 2025 లో 12 చెరువులు హైడ్రా సుందరికరించాలని టార్గెట్ పెట్టుకుంది. ల్యాండ్ గ్రబ్బర్స్, ల్యాండ్ మాఫీయా వాళ్లు హైడ్రా ను వ్యతిరేకిస్తున్నారు. ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా హైడ్రా వైపు చూస్తున్నారు. ప్రజలు, చదువుకున్న వాళ్ళు హైడ్రా వైపు వస్తున్నారు. సామాన్యులను ఇబ్బందిపెట్టే ఉద్దేశ్యం హైడ్రాకు లేదు. మీరట్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేయమని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుంది. జూలై తర్వాత అనధికారికంగా, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేవాటిపై చర్యలు తప్పవు. వచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. ఎఫ్‌టీఎల్‌లో ఉన్న షెడ్లపై ప్రజలెవరు అద్దెకు తీసుకోవద్దు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తున్నాం అని రంగనాథ్ ప్రకటించారు.