Site icon HashtagU Telugu

Hydra Demolitions : తెల్లవారుజామునే రంగంలోకి హైడ్రా.. కోట్లు విలువైన విల్లాల కూల్చివేతలు

Hydra Demolitions Hyderabad City Bachupally

Hydra Demolitions : హైడ్రా అధికారులు ఇవాళ తెల్లవారుజామునే హైదరాబాద్ నగరంలో రంగంలోకి దిగారు.  అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియను మొదలుపెట్టారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్‌లో ఉన్న లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌కు చెందిన విల్లాలలో అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చివేశారు. మల్లంపేట్ (కత్వ) చెరువుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ సంస్థ కోట్లు విలువైన విల్లాలను నిర్మించిందని గతంలోనే హైడ్రా అధికారులు గుర్తించారు.  భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు(Hydra Demolitions) జరిగాయి.

Also Read :Munneru Floods Threat: మున్నేరుకు మరోసారి వరద గండం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

హైదరాబాద్‌లోని కబ్జాకోరుల గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తోంది. ఎవరినీ లెక్క చేయకుండా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేస్తూ  ముందుకు సాగుతోంది. ఇప్పటికే దాదాపు 18 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కుల చెర నుంచి హైడ్రా విడిపించింది. తాజాగా ప్రముఖ స్థిరాస్తి సంస్థ జయభేరికి హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగళాల్ కుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. గతంలో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చేసింది. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నిర్మించారనే అభియోగాలతో ఎన్ కన్వెన్షన్‌ నిర్మాణాలను కూల్చారు.

Also Read :Islamic Countries Alliance : ఇస్లామిక్ దేశాల కూటమితో ఇజ్రాయెల్‌ ఉగ్రవాదాన్ని ఆపుదాం: ఎర్దోగన్