Site icon HashtagU Telugu

Hydraa : జోరు వానను సైతం లెక్క చేయని హైడ్రా క‌మిష‌న‌ర్..నీట మునిగిన ప్రాంతాల్లో ప‌ర్య‌ట‌న‌

Hydra Rain

Hydra Rain

శుక్రవారం హైదరాబాద్ (Hyderabad) నగరవ్యాప్తంగా కురిసిన భారీ వర్షం(Rain)తో నగర జీవనం అస్తవేస్తమైంది. పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నడుం లోతు వరద నీరు ఇళ్లలోకి చేరింది. ప్యాట్నీ నాలా పరిధిలోని కాలనీలు నీట మునిగిపోయాయి. వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గాలు లేకపోవడంతో రోడ్లు, వీధులు తలకిందులయ్యాయి. మాసాబ్ ట్యాంక్, హైటెక్ సిటీ, అయ్యప్ప సొసైటీ, గాజులరామారం, కూకట్పల్లి, హాఫిజ్‌పేట్ వంటి ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచినట్టు హైడ్రా (Hydraa) కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది.

Hilsa fish : పులస చేప ఎందుకంత ఖరీదు..దానిలోని విశేష గుణాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ప్రతి వర్షాకాలంలో ప్యాట్నీ నాలా పరిధిలోని కాలనీలు నీట మునిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలోనే నాలా విస్తరణకు చర్యలు తీసుకున్నా, ఓ ఇంటి యజమాని పనులను అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయినట్టు సమాచారం. దీంతో ఈసారి కూడా మునుగుడు సమస్య కొనసాగినట్లు తెలుస్తోంది. ఇంటి యజమానుల నిరాకరణ వల్ల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైడ్రా కమీషనర్ శ్రీ ఏవీ రంగనాథ్, జలమయమైన ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తూ, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్యాట్నీ నాలా పరిసరాల్లో బోటులో తిరుగుతూ, ఇళ్లలో చిక్కుకుపోయినవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకున్నారు. డీఆర్‌ఎఫ్ సిబ్బంది, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు రంగంలోకి దిగి సహాయ చర్యల్లో పాల్గొని , ప్రజల ప్రాణాలను రక్షించేందుకు అధికారులు పనిచేసారు.

Dragon fruit milk shake : డ్రాగన్ ప్రూట్‌తో హై రిచ్ ప్రోటీన్ మిల్క్ షేక్ చేసుకోవడం ఎలా?

 

అంబర్‌పేటలో బతుకమ్మ కుంట వరదనీటిని భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షం కారణంగా పెద్ద మొత్తంలో వరద నీరు బతుకమ్మ కుంటలోకి చేరుతోంది. గతంలో ఇదే ప్రాంతంలోని లోతట్టు కాలనీలు వరద నీటిలో మునిగేవని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు చెరువు ఉండడం వల్ల ఆ నీరు అక్కడే నిలవడం ప్రజలకు కొంత ఊరటనిస్తోంది. అయినా కూడా ఈ పరిస్థితిని గమనించి ప్రభుత్వం త్వరగా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.