హైడ్రా (Hydra) ..ఇప్పుడు హైదరాబాద్ (Hyderabad) నగరవ్యాప్తంగా హడలెత్తిస్తోంది. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ (CM Revanth) ఉక్కుపాదం మోపుతూ..హైడ్రా ను రంగంలోకి దింపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సీఎం రేవంత్ హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు. నగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆక్రమణదారులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది. హైడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
పేద, ధనిక, సినిమా స్టార్లు, రాజకీయ నేతలు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తూ… ప్రభుత్వ స్థలాన్ని అంగులం ఆక్రమించిన తీవ్రంగా ప్రతిఘటిస్తూ హైడ్రా దూసుకెళ్తుంది. ఇప్పటికే ఎన్నో అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా..ఒవైసి బ్రదర్స్ సలకం చెరువులో నిర్మించిన కట్టడాలను, మల్లారెడ్డి కి చెందిన పలు విద్యాసంస్థలను, అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి కి చెందిన అక్రమ నిర్మాణాలను సైతం కూల్చబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒవైసి అయినా మల్లారెడ్డి అయినా హైడ్రాకు ఒక్కటే అన్నారు. చెరువుల్లో కాలేజీలు కడితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని కొంత సమయం ఇస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Commissioner Ranganath) అన్నారు.
ఇదిలా ఉంటె హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి భద్రత పెంచింది ప్రభుత్వం. మధుర నగర్‌లో ఉన్న కమిషనర్ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇందులో భాగంగా.. కమిషనర్ రంగనాథ్ నివాసం దగ్గర ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. కాగా నగరంలో ఇటీవల హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలు కూల్చివేతలు చేపట్టిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ కు ముప్పు పొంచి ఉండటంతో ఈ భద్రత ఏర్పాటు చేశారు. ఇక రంగనాధ్ విషయానికి వస్తే..
రంగనాథ్ 1970లో నల్గొండలో జన్మించారు. 1996లో డీఎస్పీగా ఎంపికైన రంగనాథ్ కుతొలుత గ్రే హౌండ్స్ అసాల్ట్ కమాండర్ గా పోస్టింగ్ వచ్చింది. తర్వాత కొత్తగూడెం, నర్సంపేట, మార్కాపురం డీఎస్పీగా పనిచేశారు. 2012లో తూ.గో అడిషనల్ ఎస్పీగా గ్రేహౌండ్స్ ఆపరేషన్లను సమర్థవంతంగా డీల్ చేశారు. దీంతో ఆయనకు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు దక్కింది.
2007లో ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా (ఇబ్రహీంపట్నం) హత్య కేసు ప్రత్యేక దర్యాప్తు అధికారిగా రంగనాథ్ కీలకంగా వ్యవహరించారు. అలాగే తెలంగాణలోని నల్గొండలో అమృత-ప్రణయ్ కేసులో నిందితుడు మారుతిరావు అరెస్టు, విచారణను సమర్థంగా నిర్వహించారు. వరంగల్ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసును ఆయనే డీల్ చేసి నిందితుడు సైఫ్ ను త్వరగా అరెస్టు చేశారు. ఇలా ఈయన బ్యాక్ గ్రౌండ్ ఎంతగానో ఉండడం తో రేవంత్ సర్కార్ ఇప్పుడు హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు అప్పటించింది. ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ.. తన మార్క్ చూపిస్తున్నారు రంగనాధ్.
Read Also : Jagan Foreign Tour : జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్