తెలంగాణలోని హైడ్రా శాఖ పనితీరుపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి (Konda Vishweshwar Reddy ) తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా (HYDRA ) పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కోల్పోయిందని ఆయన మండిపడ్డారు. “పేదల ఇళ్లపై బుల్డోజర్లతో దాడులు చేస్తూ, ఎంఐఎం నాయకులు ఆక్రమించిన భూముల విషయంలో మాత్రం ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది” అని ఆరోపించారు. ఇది స్పష్టంగా రాజకీయ ఒత్తిడులకు లొంగిన చర్యలుగా చెబుతూ, న్యాయమైన వ్యవహారం లేదన్నారు.
Peddi : ‘పెద్ది’లో శివరాజ్ కుమార్ లుక్ రిలీజ్
ఎంఐఎం (MIM) పార్టీకి ప్రభుత్వ యంత్రాంగం భయపడుతోందని ఎంపీ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ముస్లిం ఓట్ల కోణంలో కాంగ్రెస్ నాయకత్వం ఒవైసీ సోదరులను అసహనానికి గురి చేయకుండా చూసుకుంటోందని చెప్పారు. “పేదలు మాత్రం అక్రమ నిర్మాణాల పేరుతో ఇళ్లను కోల్పోతున్నారు. అదే సమయంలో MIM నేతలు ఆక్రమించిన భూములపై ఎటువంటి చర్యలూ కనిపించడం లేదు” అని విమర్శించారు.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ బాధ్యత లేని తీరును ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి హెచ్చరించారు. “స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో ప్రజలకు బాగా అర్థమవుతోంది. ప్రభుత్వానికి ఓటు బ్యాంక్ రాజకీయాలే ముఖ్యం. న్యాయం, సమానత్వం కాదు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై రాజకీయ వేడి పెరుగుతున్న ఈ తరుణంలో, ఈ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీయనున్నాయి.