Hyderabad: తెలంగాణాలో మరో కొత్త పార్టీ.. మేనిఫెస్టో విడుదల

తెలంగాణ ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించే పనిలో ఉన్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ తమ 115 అభ్యర్థుల జాబితాను నెల క్రితమే విడుదల చేసింది

Hyderabad: తెలంగాణ ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించే పనిలో ఉన్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ తమ 115 అభ్యర్థుల జాబితాను నెల క్రితమే విడుదల చేసింది. ఇటీవల బీఎస్పీ పార్టీ తొలి జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. ఇదిలా ఉండగా తెలంగాణ ఎన్నికల్లో మరో కొత్త పార్టీ పోటీకి సిద్ధమైంది. హైదరాబాద్ యూత్ కరేజ్ అనే సంస్థ వచ్చే ఎన్నికల్లో నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ యూత్ కరేజ్ అధ్యక్షుడు మహ్మద్ సల్మాన్ మాట్లాడుతూ.. మేము నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు మొదటి హైదరాబాద్‌ నుంచి మా ప్రయాణాన్ని మొదలుపెడుతున్నామని ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా బరిలోకి దిగుతున్నామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో నేను మత రాజకీయాలు చేయను, ద్వేషం, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయను. నేను వితంతువులు, పేదలు, వెనుకబడిన ప్రజల సంక్షేమం మరియు వారి అభివృద్ధి గురించి పోరాడుతానని సల్మాన్ తెలిపారు. ఈ క్రమంలో సల్మాన్ తన మేనిఫెస్టోను విడుదల చేశారు.

* నాంపల్లి నియోజకవర్గం నుండి పది మంది పేదలకు హజ్ యాత్ర,
* ముయెజ్జిన్ లేదా ఇమామ్ పిల్లలకు విద్యా గ్రాంట్ రూ. 20,000,
* నిరుద్యోగులకు వ్యాపారం ప్రారంభించినందుకు రూ. 1.5 లక్షల గ్రాంట్, వితంతువు లేదా ఆమె కుమారుడికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం,
* కూతురి పెళ్లి కోసం అప్పు చేసి తిరిగి చెల్లించలేని వారికి రూ.2 లక్షలు
* పేదలకు వడ్డీలేని రుణాలు అందజేస్తోంది.

Also Read: America Nanny Job : పిల్లలను చూసుకోవడానికి ఆయా కావాలి..నెలకు జీతం రూ.83 లక్షలు