Hyderabad Woman Jumps To Death From 5th Floor While : ఇటీవల రోజుల్లో ఆత్మహత్య (Suicide) అనేది ఫ్యాషన్ గా మారింది. ప్రతి సమస్యకు చనిపోవడం ఒక్కటే మార్గంగా ఆలోచించి నిండైనా జీవితాన్ని మధ్యలోనే తుంచుకుంటున్నారు. సమస్య వస్తే అందులో నుండి ఎలా బయటపడాలో ఆలోచించకుండా ఆత్మహత్యే శరణ్యమని నిర్ణయం తీసుకుంటూ వారి కుటుంబంలో విషాదాన్ని నింపుతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజు వెలుగులోకి వస్తూనే ఉండగా..తాజాగా హైదరాబాద్ (Hyderabad) లో ఓ మహిళా (23 yr Old woman) ఐదో అంతస్థు నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కు సంబదించిన వీడియో వైరల్ గా మారింది.
హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హరినగర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ గిరి శిఖర అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తు ఎక్కింది. అక్కడ గోడపైకి ఎక్కి కూర్చుంది. ఈమెను గమనించిన స్థానికులు కేకలు వేశారు. దుకొద్దు..దుకొద్దు అంటూ వారంతా అరుస్తున్న.. హఠాత్తుగా ఒక్కసారిగా ఐదో అంతస్తు నుంచి కిందకి దూకింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమె వద్దకు వెళ్లారు. వెంటనే అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు. కానీ అప్పటికే ఆమె మరణించింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Read Also : Transgender Uniform : ట్రాన్స్ జెండర్ల యూనిఫామ్స్ నమూనా ..