ఒకే గదిలో ఉక్కపోత చాలు.. గడి దాటాలి కాళ్లు, కలలు అని అంటాడో రచయిత. నేటి యూత్ అచ్చం ఇలానే ఆలోచిస్తోంది. ప్రతిరోజు నాలుగు గోడల మధ్య పనిచేస్తూ రొటీన్ జీవితాలు గడుపుతున్నారు. ఈ ట్రెండ్ నుంచి బయట పడేందుకు కొత్త గా ఆలోచిస్తున్నారు. వారంల ఒకటి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోం, వర్క్ ఆకేషన్ అంటూ సొంతూళ్లు, నచ్చిన ప్రదేశాలకు వెళ్తూ ఎంచక్కా ఆఫీస్ విధులను నిర్వహిస్తున్నారు.
ఈ మార్పులను గమనించిన తెలంగాణ ప్రభుత్వం ఐటీ ఎంప్లాయిస్ కోసం డిఫరెంట్ థీమ్ ను తీసుకొచ్చింది. అదే టెకీ పార్క్. ఉద్యోగులు, విద్యార్థులు తమ పనులను, విధులను ఆరు బయటే హాయిగా చేసుకునేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) టెకీ పార్క్ ను ఏర్పాటు చేసింది. మాదాపూర్‌లోని పార్క్‌లో పిల్లల ఆట పరికరాలు తో పాటు విద్యా శిల్పాలు ఉంటాయి. ఇక టెక్కీల కోసం ప్రత్యేకంగా వర్క్‌స్టేషన్లు ఉంటాయి. ఉచితంగా వైఫ్ అందిస్తూ అద్భుతమైన సీటింగ్ లో పనిచేసుకునేలా వసతులను ఏర్పాటు చేసింది “ఇంటరాక్టింగ్ ప్రాంతాలు, ల్యాప్‌టాప్ వర్కింగ్ సీటింగ్, ఛార్జింగ్ పాయింట్‌లతో కూడిన ల్యాప్‌టాప్, కిడ్స్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, గెజిబో, ఫుడ్ కియోస్క్” లాంటి మరిన్ని ఏర్పాటు చేశామని జీహెచ్ ఎంసీ ఉన్నతాధికారి తెలిపారు.
ఈ పార్క్ పిల్లల్లో సైన్స్ అంశాలను నేర్పించడమే కాకుండా, అన్ని వయసుల వారికి వినోద సౌకర్యాలను కూడా అందిస్తుంది. సైన్స్ పార్క్‌లో ఓపెన్ జిమ్‌తో పాటు ప్రత్యేక ఆట స్థలం ఉంది. సీనియర్ సిటిజన్ల కోసం ర్యాంప్‌లు, నడక మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. పార్క్‌లో క్లాసీ సీటింగ్ ఏర్పాట్లు, వాటర్ క్యాస్కేడ్, పచ్చదనం, వాష్‌రూమ్‌లు, సెక్యూరిటీ రూమ్ కూడా ఉన్నాయి. ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ఆదేశాల మేరకు నగరవ్యాప్తంగా 50 థీమ్ పార్కులు అందుబాటులోకి రానున్నాయి.
Also Read: Bholaa Shankar Pre-release: భోళా శంకర్ ప్రిరిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా!