Site icon HashtagU Telugu

TSPSC Group1 Exam: హైదరాబాద్ లో 144 సెక్షన్

TSPSC Group1 Exam

TSPSC Group1 Exam

TSPSC Group1 Exam: TGPSC గ్రూప్-I ప్రిలిమ్స్ పరీక్ష కోసం అన్ని పరీక్షా కేంద్రాలవద్ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (Cr. PC) సెక్షన్ 144 విధిస్తూ హైదరాబాద్ నగర పోలీసులు నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ 9వ తేదీ ఉదయం 6 గంటల నుండి జూన్ 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ సెక్షన్ అమలులో ఉండనుంది. పరీక్షను సజావుగా నిర్వహించే లక్ష్యంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లాలోని మొత్తం 76 పరీక్షా కేంద్రాల వద్ద 500 గజాల చుట్టూ 4 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడి ఉండకూడదు.

పరీక్షను సజావుగా నిర్వహించే క్రమంలో పౌరులు సహకరించాలని మరియు ఆంక్షలకు కట్టుబడి ఉండాలని పోలీసులు కోరారు. పరీక్షకు హాజరయ్యే వేలాది మంది అభ్యర్థులకు న్యాయమైన మరియు అంతరాయం లేని పరీక్ష ప్రక్రియను సులభతరం చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Prashant Kishor: పీకే సంచలన నిర్ణయం.. ఇక ప్రిడిక్షన్ ఉండదు