Site icon HashtagU Telugu

Metro : త్వరలో హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులు ప్రారంభం: ఎన్వీఎస్ రెడ్డి

Hyderabad Metro Phase 2 expansion work to start soon: NVS Reddy

Hyderabad Metro Phase 2 expansion work to start soon: NVS Reddy

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఐదు కారిడార్లకు డీపీఆర్‌లు సిద్ధం చేసి పంపించామన్నారు. మేడ్చల్ వైపు కారిడార్ కోసం డిమాండ్లు వస్తున్నాయన్నారు. మెట్రో రైలు కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టిందన్నారు. ప్రస్తుతం విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించానన్నారు. మొత్తం మూడు కారిడార్లు విమానాశ్రయానికి కలిపేలా రెండో దశ ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. రెండో దశ పూర్తయితే మరింత పురోగతి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రెండో దశలో ఆరు కారిడార్లతో 116.4 కిలోమీటర్లు ప్లాన్ చేశామని తెలిపారు. మొదటి దశ మెట్రో రైలు నిర్మాణం సమయంలో తన దిష్టిబొమ్మలు దగ్ధం చేశారని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అయితే నాడు అలా చేసిన వాళ్లే నేడు పూలదండలతో సత్కరిస్తున్నారని చెప్పారు.

మొత్తం మూడు కారిడార్లు విమానాశ్రయానికి కలిపేలా రెండో దశ ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మెట్రో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారని ఆయన అన్నారు. ముంబయి, చెన్నైలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మెట్రో రైలును విస్తరిస్తున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. మన నగరంలో విస్తరణ లేకపోవడం వల్ల మూడో స్థానంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, తర్వాత స్థానంలో హైదరాబాద్ ఉందని వెంటనే మెట్రో విస్తరించకపోతే 9వ స్ధానానికి పడిపోయే ప్రమాదం ఉందని ఎమెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Constitution : ఈ పుస్త‌కాన్ని ప్రధాని చదివి ఉంటే.. ఇలాంటి ప‌నులు చేసేవాడు కాదు : రాహుల్