Site icon HashtagU Telugu

Hyderabad Metro : పాతబస్తి మెట్రో రైలు పనులు మొదలు పెడతాం.. 5.5 కిలోమీటర్లు.. 5 స్టేషన్లు..

Hyderabad Metro MGBS to Falaknama Extending works starting Soon

Hyderabad Metro MGBS to Falaknama Extending works starting Soon

పాతబస్తీ మెట్రోరైలు(Metro Rail) పనులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(HMRL) కసరత్తు మొదలు పెట్టింది. తాజాగా మెట్రోరైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాతబస్తీ మెట్రో రైలు పనుల గురించి మాట్లాడారు.

ఎన్వీఎస్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ గురై ఆదేశాల మేరకు ఓల్డ్ సిటీ(Old City)కి మెట్రో రైల్ తీసుకు వెళ్లడంపై కసరత్తు ప్రారంభించాము. నెలరోజుల్లో భూసేకరణకు నోటీసులు జారీ చేస్తాం. MGBS నుండి ఫలక్ నామా వరకు 5.5 కిలోమీటర్ల మేర ఓల్డ్ సిటీలో మెట్రో నిర్మాణం చేయనున్నాం. ఈ మార్గంలో సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్ గంజ్, ఫలక్ నామా ప్రాంతాల్లో ఐదు స్టేషన్లు రానున్నాయి అని తెలిపారు.

అలాగే ఈ మార్గంలో మెట్రో చేపట్టేందుకు 103 మతపరమైన అటంకాలను తొలగించాల్సి ఉందని, అందులో 21 మసీదులు, 12 దేవాలయాలు, 33 దర్గాలు, ఏడు స్మశాన వాటికలు, ఆరు చిల్లాలు. ఇతర నిర్మాణాలు ఉన్నాయని తెలిపారు. ఎక్కువ కట్టడాలను కూల్చకుండా 80 అడుగులకు మేరకు రోడ్డు విస్తరణ చేయడం ద్వారా ఈ మార్గంలో మెట్రో పనులు చేయడానికి ప్లాన్ చేయడానికి చూస్తున్నట్టు, MGBS నుండి ఫలక్ నామా వరకు నిర్మించనున్న మార్గంలో మొత్తం వెయ్యి ఆస్తులను సేకరించాల్సి ఉంటుందని తెలిపారు మెట్రో అధికారులు.

 

Also Read : Telangana Bonalu : బోనాల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక నిధులు ఇచ్చింది – మంత్రి త‌ల‌సాని