Site icon HashtagU Telugu

Hyderabad Metro : ప్రయాణికులకు షాక్ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో..

Hyd Metroshock

Hyd Metroshock

హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ప్రయాణికులకు (Passengers) భారీ షాక్ (Big Shock) ఇచ్చింది. అసలే సమ్మర్ సీజన్..రోడ్ల మీద ట్రాఫిక్ జాం ల మధ్య ప్రయాణం చేయాలంటే నరకం చూడాల్సిందే..ఇలాంటి సమయంలో కాస్త డబ్బులు పోయిన మంచిదే అని చెప్పి మెట్రో లో ప్రయాణం చేసి..కాస్త రిలాక్స్ కావాలని నగర వాసులు భావిస్తున్నారు. ఇలాంటి ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో షాకింగ్ విషయాన్ని ప్రకటించింది. గత కొద్దీ నెలలుగా మెట్రో రూ.59 హాలిడే కార్డుగా పిలిచే ఆఫర్ రన్ చేస్తూ వస్తుంది. ఈ కార్డు ద్వారా కేవలం రూ.59 తో రోజంతా మెట్రో లో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. ఈ ఆఫర్ తో నగర వాసులు ఎంతో ఉత్సహంగా నగరం మొత్తం చుట్టేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఆఫర్ ను రద్దు చేస్తున్నట్లు మెట్రో ప్రకటించి షాక్ ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

మార్చి 31తో హాలిడే కార్డు ఆఫర్‌ ముగిసిందని అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో ఉండే మెట్రో కార్డు కొంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు.. రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి వరకు ఇచ్చే 10 శాతం రాయితీని సైతం ఎత్తివేసింది. అయితే, ఎండల తీవ్రతతో మెట్రో రైలుకు డిమాండ్ పెరగడంతో రాయితీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మెట్రో రైల్ అధికారుల నిర్ణయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాయితీలను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Read Also : Chandrababu: కేశినేని అడ్డాలో నేడు చంద్రబాబు పర్యటన, పెద్ద ఎత్తున జన సమీకరణ