GHMC Mayor Vijaya Lakshmi: బంజారాహిల్స్‌లోని ఇంటిని కాపాడుకునేందుకు మేయర్ కాంగ్రెస్ లోకి?

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నాయి.బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లాల్లో పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Ghmc Mayor Vijaya Lakshmi

Ghmc Mayor Vijaya Lakshmi

GHMC Mayor Vijaya Lakshmi: లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నాయి.బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లాల్లో పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.అయితే ఆమె హుటాహుటిన కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కేసీఆర్ మిత్రుడు కేకే కుమార్తె కదా, మరి ఆమె ఉన్నపలంగా పార్టీ ఫిరాయింపుకి కారణమేంటని చర్చ నడుస్తుంది.

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తక్కువ ధరకు కొనుగోలు చేసిన బంజారాహిల్స్‌లోని తన ఇంటిని కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్‌లోకి ఫిరాయిస్తున్నారా? మేయర్‌కు లీగల్ నోటీసు అందించిన న్యాయవాది చేసిన ఆరోపణ ఇది. న్యాయవాది రాజేష్ కుమార్ జారీ చేసిన నోటీసు ప్రకారం మే 23, 2023న ప్రభుత్వ ఉత్తర్వు 56 (GO 56) ఆమోదించబడింది. దీనిలో మేయర్ విజయలక్ష్మి మరియు ఆమె సోదరుడు కె వెంకటేశ్వరరావుకు అనుకూలంగా బంజారాహిల్స్‌లోని ఎన్‌బిటి నగర్‌లోని రెండు ప్లాట్లను రెవెన్యూ శాఖ క్రమబద్ధీకరించింది.

ఆ రెండు ప్లాట్లను క్రమబద్ధీకరించాలని తెలంగాణ భూపరిపాలన ప్రధాన కమిషనర్‌తో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆమె ఆదేశించింది. బంజారాహిల్స్‌లోని ఎన్‌బిటి నగర్‌లోని రోడ్‌నెం 12లోని హెచ్.నెం.8-2-686/22లో 1,161 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న భూమిని కె. వెంకటేశ్వరరావుకు అనుకూలంగా రూ.2,500 చదరపు గజాలకు (రూ. 29,02,500), అదే ప్రాంతంలో 425 చదరపు గజాల విస్తీర్ణంలో విజయలక్ష్మి గద్వాల్‌కు అనుకూలంగా చదరపు గజం రూ.350 (రూ. 1,48,750)కి రిజిస్టర్ చేశారు. దీంతో తక్కువ ధరమ్ ఖరీదైన భూముల్ని తన పేరిట బదిలీ చేయించారన్న ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: Ram Charan: చెర్రీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. చరణ్ బర్త్డే కి కీలక అప్డేట్స్!

  Last Updated: 23 Mar 2024, 05:39 PM IST