Site icon HashtagU Telugu

Bonalu 2023 : లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం రంగం.. ఈ సంవత్సరం ఏం చెప్పిందో తెలుసా?

Lashkar Bonalu

Lashkar Bonalu

హైదరాబాద్(Hyderabad) పాతబస్తీ లాల్ దర్వాజా(Lal Darwaza) సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల(Bonalu) జాతర ఘనంగా జరుగుతుంది. నిన్నటి నుంచి భారీగా ఆలయానికి భక్తులు తరలి వస్తున్నారు. రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు కూడా విచ్చేసి అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. ఇక అందరూ ఎదురుచూస్తున్న భవిష్యవాణి(Bhavishyavani) రంగం కార్యక్రమం నేడు సాయంత్రం జరిగింది.

సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారి భక్తురాలు అనురాధ పచ్చికుండపై నిలబడి అమ్మవారిని ఆవహించుకొని భవిష్యవాణి చెప్పింది. ఈ భవిష్యవాణిలో.. ఎవరికి ఏమి కాకుండా చూసుకుంటాను. మీరు చేసే పాపాల వల్ల వైపరీత్యలు జరుగుతున్నాయి. కొంత ఆలస్యంగా వర్షాలు కురుస్తాయి ఈ సంవత్సరం. గుడి ఆలయం అంశంలో మీరు కోరుకున్నది మీరే నెరవేర్చుకోవాలి. మీ వెంటనే నేను ఉన్నాను. ఎవరు ఎక్కడ నుంచి వచ్చినా కోరుకొని మొక్కులు చెల్లించుకుంటే ఏం కావాలన్నా నెరవేరుస్తా. పసుపు, కుంకుమలు తీసుకొని వస్తే అడుగడునా మిమ్మల్ని కాపాడుకుంటా. శాంతి పూజలు చేసిన తర్వాత ఆడపడుచులకు అన్ని విధాలా మంచి చేస్తా. అందరినీ కాపాడుకునే శక్తి నాది. ఎవరి మనసులో ఏమున్నా నా దగ్గరికి వస్తే అన్ని బాధలు తీరుస్తా. నలుగురికి మంచి చేసే పనిలో నేను ఉంటా. పుణ్యం, పాపం ఏది చేసినా మీకే సొంతం. మంచికాలంలో మంచిగా నడుచుకున్నపుడు మంచే జరుగుతుంది అని తెలిపింది.

ఇక నేడు శాలిబండ నుంచి పురానా పూల్ వరకు సాగే అమ్మవారి రథయాత్రతో పాతబస్తీ బోనాలు ఘనంగా ముగియనున్నాయి. ఈ ఊరేగింపులో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారు.

 

Also Read : Telangana Bonalu : బోనాల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక నిధులు ఇచ్చింది – మంత్రి త‌ల‌సాని

Exit mobile version