Hyderabad: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసులో ఐదుగురు అరెస్ట్

హైదరాబాద్‌ పోలీసులు ఇటీవల జరిగిన హిట్ అండ్ రన్ కేసును ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఒక యువతి, నలుగురు యువకులు ఉన్నారు.

Hyderabad: హైదరాబాద్‌ పోలీసులు హిట్ అండ్ రన్ కేసును ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఒక యువతి, నలుగురు యువకులు ఉన్నారు. మద్యం మత్తులో అతివేగంతో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్దారించారు. జూబ్లీహిల్స్‌లో ఉదయం 5 గంటలకు జరిగిన ప్రమాదంలో బౌన్సర్ తారక్రమ్ మృతి చెందాడు . ఇందుకు బాధ్యులైన ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ1గా కొవ్వూరి రిత్విక్ రెడ్డి, ఏ2 వైష్ణవి, ఏ3 లోకేశ్వర్ రావు, ఏ4 బుల్లా అభిలాష్, ఏ5 అనికేత్ ఉన్నట్లు తెలుస్తోంది .

ఏసీపీ హరిప్రసాద్ మాట్లాడుతూ.. పోలీసులకు పట్టుబడతామన్న భయంతో రిత్విక్ రెడ్డి తప్పించుకున్నాడు. ఆ తర్వాతా ప్రమాదానికి కారణమైన కారును బీహెచ్‌ఈఎల్‌లో దాచి ఉంచినట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఏ1గా ఉన్న రిత్విక్ రెడ్డి అమెజాన్ ల పనిచేస్తున్నాడని తెలిపారు. రిత్విక్ రెడ్డి మరియు స్నేహితులంతా కలిసి బార్‌కు వెళ్లారని, తెల్లవారుజామున నాలుగు గంటల వరకు బార్‌లోనే మద్యం మత్తులో ఉన్నారని తెలిపారు. రిత్విక్ మద్యం మత్తులో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ఏసీపీ వెల్లడించారు. తనతో పాటు కారులో ఉన్న వారిని కూడా నిందితులుగా చేర్చినట్లు తెలిపారు

జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ దేవాలయం సమీపంలో బుధవారం తెల్లవారుజామున కారు మోటార్‌ బైక్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత కారు వేగంగా వెళ్లిపోయింది. తలకు గాయమైన తారక్ రామ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో బౌన్సర్ రాజు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. నిందితుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ తారక్ రామ్ కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మృతదేహంతో నిరసనకు దిగారు. ఘటనాస్థలికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు కారును గుర్తించి, కారులో ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళతో సహా ఐదుగురు యువకులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గురైన తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారును ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

Also Read: TSPSC Chairman: టీఎస్‌పీఎస్‌పీ ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ ఆమోదం