Hyderabad Tour : హైదరాబాద్‌లో ఒకరోజు ఫుల్ టూర్ చేయాలని అనుకుంటున్నారా ? అయితే మీకు ఇది మంచి అవకాశం. ఒకరికి కేవలం రూ.430 చొప్పున ఖర్చుతో హైదరాబాద్ వన్డే టూర్‌కు అవకాశం ఉంది. ఈ టూర్‌లో భాగంగా చార్మినార్, గోల్కొండ, సాలార్ జంగ్ మ్యూజియం, నిజాం కాలం నాటి కట్టడాలను వరుసపెట్టి చూడొచ్చు. టూరిస్టుల సమయం, ఖర్చులను ఆదా చేసేందుకు తెలంగాణ టూరిజం విభాగం ఒక స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది. దీని పేరు.. ‘హైదరాబాద్ వన్డే టూర్ ప్యాకేజీ’ (HYDERABAD ONE DAY TOUR PACKAGE). ఇది ప్రతి రోజూ అందుబాటులో ఉంటుంది. ఉదయం 7:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:30 గంటలకు ముగుస్తుంది. ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో టూరిస్టులు ఆయా ప్రదేశాలను చూసి రావొచ్చు.
Also Read :Iron Rod Vs Infant: 30 రోజుల పసికందుకు ఇనుప చువ్వలతో 40 వాతలు.. ఏమైంది ?
టూర్ సాగేది ఇలా..
- టూర్ ప్రతిరోజూ ఉదయం 7:30 గంటలకు సికింద్రాబాద్‌లోని(Hyderabad Tour) బేగంపేట యాత్రి నివాస్ నుంచి షురూ అవుతుంది.
- 7:45 గంటలకు పర్యాటక భవన్ వద్ద, 8:15 గంటలకు బషీర్‌బాగ్ సీఆర్‌ఓ ఆఫీసు వద్ద టూరిస్టులకు బోర్డింగ్ పాయింట్ ఉంటుంది.
- తదుపరిగా బిర్లా మందిర్‌కు తీసుకెళ్తారు.
- శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో చౌమహాల్లా ప్యాలెస్, చార్మినార్, మక్కా మసీద్, లాడ్ బజార్‌లకు బస్సులు వెళ్తాయి. అక్కడ దిగి షాపింగ్ చేసుకోవచ్చు.
- తదుపరిగా సాలార్‌జంగ్ మ్యూజియం చూసిన తర్వాత భోజన విరామ సమయం ఇస్తారు.
- శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో నిజాం జూబ్లీ పెవిలియన్ విజిట్‌కు తీసుకెళ్తారు.
- కేవలం శుక్రవారాల్లో మాత్రమే నెహ్రూ జూ పార్క్‌కు బస్సులు వెళ్తాయి.
- తదుపరిగా గోల్కొండ కోట సందర్శన ఉంటుంది.
- కుతుబ్ షాహీ సమాధులకు తీసుకెళ్తారు.
- చివరగా ఐమాక్స్ రోడ్ ఖైరతాబాద్ లుంబినీ పార్క్‌కు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
- షాపింగ్, టిఫిన్, భోజనం వంటి వ్యక్తిగత ఖర్చులు ప్యాకేజీలో ఉండవు.
Also Read :Hyderabad : హైదరాబాద్‌లో ఎన్ని అంతస్తుల వరకు నిర్మాణం జరుపుకోవచ్చు..?
ఛార్జీలు, బుకింగ్ వివరాలివీ
- పెద్దలకు నాన్ ఏసీ బస్సుల్లో రూ.430 ఛార్జీ తీసుకుంటారు. 5-12 ఏళ్లలోపు పిల్లలకు ఛార్జీ రూ. 350.
- పెద్దలకు ఏసీ బస్సుల్లో రూ.500, పిల్లలకు రూ.400 ఛార్జీ ఉంటుంది.
- తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.
- హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌లో ఉన్న తెలంగాణ పర్యాటక కార్యాలయంలో కూడా ఈ ప్యాకేజీని తీసుకోవచ్చు.
- టూర్ ప్యాకేజీ వివరాల కోసం ఈమెయిల్: mailto:info@telanganatourism.gov.inను సంప్రదించాలి.