Viyona Fintech : ఫిన్‌టెక్ రంగం విప్లవాత్మకంగా పురోగమిస్తోంది. అత్యాధునిక ఆర్థిక సేవల విప్లవంలో ఒక భాగమై ‘వియోనా ఫిన్‌టెక్’ కంపెనీ దూసుకుపోతోంది. ఈ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా శరవేగంగా కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా రెండు ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్‌ను ప్రారంభించింది. వాటి పేర్లు.. వియోనా పే, గ్రామ్ పే. దేశంలోని గ్రామీణ, సెబీ అర్బన్ ప్రాంతాల ప్రజలను ఆర్థిక స్రవంతిలోకి తీసుకొచ్చే దిశగా దీన్ని కీలక అడుగుగా వియోనా ఫిన్ టెక్ అభివర్ణించింది.
Also Read :CM Atishi : ఏడ్చేసిన ఢిల్లీ సీఎం అతిషి.. బీజేపీ నేత రమేశ్ బిధూరి వ్యాఖ్యల ఎఫెక్ట్
వియోనా ఫిన్ టెక్ ఏం చేస్తుంది ?
వియోనా ఫిన్ టెక్ కంపెనీ తమ యూజర్లకు డీటెయిల్డ్ పేమెంట్ సొల్యూషన్స్, బ్యాంకింగ్ సొల్యూషన్స్ సేవలను అందిస్తుంటుంది. పే ఇన్, పే ఔట్ ప్లాట్‌ఫామ్‌లను తయారు చేసి సమకూరుస్తుంటుంది. వీటితో పాటు యూపీఐ ఇంటిగ్రేషన్, కనెక్టెడ్ బ్యాంకింగ్ ఏపీఐలను డెవలప్ చేసి అందిస్తుంటుంది. చాలా వ్యాపార సంస్థల ఆర్థిక కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు దన్నుగా నిలిచే నమ్మకమైన సాంకేతిక భాగస్వామిగా తాము ఎదిగామని వియోనా ఫిన్ టెక్(Viyona Fintech) వెల్లడించింది.
ఏమిటీ గ్రామ్ పే ?
వియోనా ఫిన్ టెక్ కొత్తగా ప్రవేశపెట్టిన ‘గ్రామ్ పే’ ప్రోడక్ట్ విషయానికొస్తే.. వ్యక్తులతో పాటు గ్రామీణ ప్రాంతాలలోని చిన్న కమ్యూనిటీలను టార్గెట్‌గా చేసుకొని దీన్ని డెవలప్ చేశారు. అది సూక్ష్మస్థాయి బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్. దీని ద్వారా యూజర్లు మైక్రో ఇన్సూరెన్స్, యూపీఐ పేమెంట్స్, మైక్రో లోన్స్, యుటిలిటీ బిల్ పేమెంట్స్, డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వంటి సేవలను పొందొచ్చు. వియోనా పే యాప్‌లో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్), డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్ (డీఎంటీ) వంటి ఫీచర్లను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. తద్వారా తమ యూజర్ల ఆర్థిక లావాదేవీలను మరింత సరళతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read :Highest Railway Platforms : ‘చర్లపల్లి’లో 9 ప్లాట్‌ఫామ్‌లు.. అత్యధిక ప్లాట్‌ఫామ్స్ ఉన్న రైల్వేస్టేషన్లు ఇవే
గ్రామీణ, పట్టణ ప్రాంతాలే లక్ష్యం : బి.నాగరాజ్, సీటీఓ, వియోనా ఫిన్ టెక్
‘‘ఇప్పుడు ఆర్థిక సేవల రంగం అనేది ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) ఆధారిత డాటా ప్రాతిపదికన నడుస్తోంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా వాటికి రక్షణ లభిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు వేగవంతమైన, సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ అనుభవాన్ని ఇచ్చే టెక్నాలజీని డెవలప్ చేయడంపై వియోనా ఫిన్ టెక్ ఫోకస్ పెట్టింది’’ అని వియోనా ఫిన్ టెక్ కంపెనీ సీటీఓ బి.నాగరాజ్ వెల్లడించారు. గ్రామ్ పే యాప్ ద్వారా తమ యూజర్లకు ఆర్థిక అక్షరాస్యత పెరిగిందన్నారు. తమ యాప్‌ను వాడుకొని ప్రజలు విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులను పే చేస్తున్నారని ఆయన తెలిపారు. తద్వారా ప్రజల సమయం, శక్తి ఆదా అవుతున్నాయని నాగరాజ్ చెప్పారు.
ఆర్థిక సేవల్లో ఇన్నోవేషన్‌కు పెద్దపీట : సి.వి.కె.మధు, సీఎఫ్‌ఓ, వియోనా ఫిన్ టెక్
‘‘ఆర్థిక సేవల్లో ఇన్నోవేషన్‌కు మేం పెద్దపీట వేస్తాం. వ్యాపారాల్లో నిర్వహణ వ్యయాలను తగ్గించేలా.. క్యాష్ ఫ్లోను ఆశాజనక స్థాయిలో నిర్వహించేలా చేయడమే మా టార్గెట్. ఆర్థిక లావాదేవీలు, సేవల్లో పారదర్శకతను పెంచడంపై మా ప్రధాన ఫోకస్ ఉంటుంది. ప్రతీ భారతీయుడికి అత్యాధునిక ఆర్థిక సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో మా కంపెనీ అడుగులు వేస్తోంది’’ అని వియోనా ఫిన్ టెక్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) సి.వి.కె.మధు వివరించారు.