Site icon HashtagU Telugu

Vande Bharat Express: వచ్చే వారం నుంచి హైదరాబాద్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్

Vande Bharat Express

Vande Bharat Express

సెప్టెంబర్ 25 నుండి హైదరాబాద్, బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్ 24న ఢిల్లీ నుంచి కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. మరుసటి రోజు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ స్టేషన్‌లో జరిగే కార్యక్రమానికి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెండు టెక్ హబ్‌ల మధ్య 609 కిలోమీటర్ల దూరాన్ని ఎనిమిది గంటల 30 నిమిషాల్లో కవర్ చేస్తుంది. రైల్వే అధికారుల ప్రకారం.. కొత్త వందే భారత్ రైళ్లు మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాల కోసం అనేక కొత్త ఫీచర్లతో చేర్చబడ్డాయి. ప్రస్తుతం భారతీయ రైల్వేలో 25 జతల వందే భారత్ రైళ్లు నడపబడుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో 120 శాతం ఆదరణతో విజయవంతంగా నడుస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు మధ్య వందే భారత్ అందుబాటులోకి రానుండటంతో వాణిజ్య సంబంధాలు మరింత మెరగవుతాయి.

Also Read: Prisoner Death: రాజమండ్రి జైల్ లో ఖైదీ మృతి, బాబు భద్రతపై టీడీపీ ఆందోళన