Site icon HashtagU Telugu

Padi Kaushik Reddy : అప్పుడే వాగ్దానాలు మొదలు పెట్టిన కౌశిక్ రెడ్డి.. హుజురాబాద్‌లో గెలిపిస్తే 1000 కోట్లు తెస్తాడట..

Huzurabad BRS Candidate Padi Kaushik Reddy started Promotions for Elections

Huzurabad BRS Candidate Padi Kaushik Reddy started Promotions for Elections

తెలంగాణ(Telangana)లో ఎలక్షన్స్(Elections) జోరు రోజు రోజుకి పెరుగుతుంది. బీఆర్ఎస్(BRS) పార్టీ ఆల్రెడీ రాబోయే ఎన్నికల్లో నియోజక వర్గాల అభ్యర్థుల్ని ప్రకటించడంతో ఇప్పట్నుంచే గెలుపు కోసం ట్రై చేస్తున్నారు అభ్యర్థులు. ప్రస్తుతం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని(Padi Kaushik Reddy) హుజురాబాద్(Huzurabad) నియోజకవర్గం నుంచి నిలబెట్టిన సంగతి తెలిసిందే.

దీంతో పాడి కౌశిక్ రెడ్డి అప్పుడే ప్రచారాలు, వాగ్దానాలు మొదలుపెట్టాడు. తాజాగా నేడు హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్ లో మినీ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చారు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్ ని అభివృద్ధి చేస్తానంటూ వాగ్దానాలు ఇచ్చారు.

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. శాసన సభ్యుడిగా నేను గెలిస్తే 1000 కోట్లతో హుజురాబాద్ ని అభివృద్ధి చేస్తాను. మినీ కలెక్టరేట్, మోడల్ చెరువును టూరిజం స్పాట్ గా మలుస్తాను. హుజురాబాద్ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తాను. త్వరలో సీఎం బహిరంగ సభ హుజురాబాద్ లోనే ఉంటుంది. సీఎం హుజురాబాద్ అభివృద్ధి పనులను ప్రకటిస్తారు అని తెలిపారు.

ఇక కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని, అపోజిషన్ ఎమ్మెల్యే ఉంటే ఏం లాభం అని, ప్రజల పనుల కోసమే అధికారుల మీద సీరియస్ అవుతున్నాను అని అన్నారు. కేసీఆర్ నాకు అండగా ఉన్నారు. ఆ అండను హుజురాబాద్ అభివృద్ధి కి ఉపయోగిస్తాను. నన్ను గెలిపిస్తే భవిష్యత్తులో హుజురాబాద్ జిల్లా కూడా అవుతుంది, మరింత అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. ఇప్పటి ప్రభుత్వ కార్యక్రమాలని కూడా ఇలా ప్రమోషన్స్ కి వాడేసుకుంటున్నారు కౌశిక్ రెడ్డి అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

 

Also Read : Hyderabad: క్వాంట‌మ్ కార్యాల‌యాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్ర‌బెల్లి