Maoists Tunnel : ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లో భారీ సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. దాదాపు 1000 మంది మావోయిస్టులు తలదాచుకునేందుకు వీలుగా దీని నిర్మాణం ఉంది. లోపల పెద్ద మైదానం కూడా ఉంది. సొరంగంలో నీటి వసతి, ఇతర సౌకర్యాలు సైతం ఉన్నట్లు సమాచారం. కొన్ని నెలల పాటు మావోయిస్టులు ఈ సొరంగంలోనే ఉన్నట్లు భద్రతా బలగాలు చెబుతున్నాయి. కర్రెగుట్టల్లో ఆరో రోజు కూంబింగ్ చేస్తుండగా ఈ సొరంగం బయటపడింది.
Also Read :Storm Control Tech: సంకల్పం గెలిచె.. పిడుగును కంట్రోల్ చేసే టెక్నాలజీ
డీహైడ్రేషన్‌కు గురైన మావోయిస్టులు
భద్రతా బలగాలు ఆరు రోజుల క్రితం కర్రె గుట్టల్లోకి(Maoists Tunnel) ఎంటరయ్యాక.. ఈ సొరంగాన్ని మావోయిస్టులు వదిలి పారిపోయినట్లు అంచనా వేస్తున్నారు. గత వారం రోజులుగా మావోయిస్టులకు సరైన ఆహారం, నీరు అందుబాటులో లేదు. దీంతో వారు ఇప్పటికే డీహైడ్రేషన్‌కు గురై ఉంటారని భావిస్తున్నారు. ఇటువంటి స్థితిలో కర్రెగుట్టల్లో ఎక్కువ దూరం మావోయిస్టులు కంటిన్యూగా నడుస్తూ వెళ్లలేరు. ఈమేరకు అంచనాతో మావోయిస్టులను చుట్టుముట్టే వ్యూహాన్ని భద్రతా బలగాలు రెడీ చేస్తున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా అడవుల్లో మావోయిస్టుల జాడను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. మావోయిస్టుల్లోని గూఢచారులు అందిస్తున్న సమాచారాన్ని వాడుకొని ట్రాకింగ్ మొదలుపెట్టారు.
Also Read :130 Nukes Warning: భారత్‌పై దాడికి 130 అణు బాంబులు: పాక్ మంత్రి
ముగ్గురు మహిళా మావోయిస్టులను..
గత ఆరు రోజులుగా కర్రెగుట్టల్లో నిర్వహిస్తున్న ఆపరేషన్‌లో ముగ్గురు మహిళా మావోయిస్టులను తెలంగాణ పరిధిలో ఎన్‌కౌంటర్ చేశారు. వారి మృతదేహాలను, ఆయుధాలను, పెద్దఎత్తున పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం రోజు కూడా భారీ సంఖ్యలో మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకొని ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి, భీమారంపాడు, కస్తూరిపాడు, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, పూజారికాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్గంలో భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం వైపున ఉన్న కర్రెగుట్టల్లో దాదాపు 24 మందికిపైగా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.