Telangana Govt Jobs: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. తెలంగాణలో త్వరలోనే ఉద్యోగాల జాతర జరగబోతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లోని దాదాపు 56వేల పోస్టుల భర్తీకి సర్కారు నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. వీటిలో అత్యధికంగా పోలీసు శాఖలో 10,500 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయట. 1,650 ఎస్సై పోస్టులను కూడా పోలీసుశాఖ భర్తీ చేయనుంది. ఇక మహిళా శిశు సంక్షేమ శాఖలో 6,399 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 7,837 హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తారట. రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 10,954 పోస్టులను సైతం రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.
Also Read :Bhu Bharati Portal: ‘భూ భారతి’ సేవలు ఏమిటి ? ఛార్జీలు ఎంత ?
ఆర్టీసీలో 3,038 పోస్టులు
వైద్యారోగ్య శాఖలో దాదాపు 6వేల పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ శాఖ పరిధిలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 2,150 డాక్టర్ పోస్టులు, 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయని సమాచారం. పలు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఇంజినీరింగ్ విభాగాల్లో 2,510 పోస్టులను ప్రభుత్వం గుర్తించింది. వ్యవసాయ శాఖలో 148, ఆర్‌అండ్‌బీలో 200 పోస్టులు, ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో 2,850 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆర్టీసీలో 3,038 పోస్టులను భర్తీ చేస్తారనే దానిపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.
Also Read :Most Influential People : ‘టైమ్’ టాప్-100 ప్రభావవంతమైన వ్యక్తులు వీరే..
మూడు విడతల్లో మొత్తం పోస్టుల భర్తీ
అయితే మొత్తం 56వేల పోస్టుల(Telangana Govt Jobs) భర్తీకి ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం లేదు. దీనికి కారణం.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన పాలనా వైఫల్యాల వల్ల ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు రుణభారాన్ని భరించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని వెంటనే అధిగమించడం కష్టం. అందుకే అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం సమర్ధంగా వినియోగించే ప్రయత్నంలో సీఎం రేవంత్ సర్కారు ఉంది. ఈక్రమంలోనే మూడు విడతల్లో 56వేల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం సంకల్పించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలి విడతలో 18,236 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. గత కొన్నేళ్లుగా ఉద్యోగ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఇది పెద్ద శుభవార్త. వారంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈసారి భర్తీ చేయనున్న వాటిలో.. గ్రూప్-1, గ్రూప్-2, 3, 4 స్థాయి పోస్టులు కూడా ఉన్నాయట. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తయినందున, పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం అయింది. ఏప్రిల్ చివరి వారం నుంచి జూన్ 2 వరకు నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశం ఉంది.