Site icon HashtagU Telugu

Telangana Election Result : తెలంగాణ ఎన్నికల రిజల్ట్ ఫై భారీగా బెట్టింగ్ లు

Huge Betting On Telangana E

Huge Betting On Telangana E

మరికొద్ది గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే పార్టీ ఏది..? గెలిచే అభ్యర్థులు ఎవరు..? అనేది తెలుస్తుంది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలపై (Telangana Election Result ) భారీగా బెట్టింగ్ (Huge Betting) లు నడుస్తున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేల్లో మెజార్టీ సంస్థలు ఒక పార్టీ (Congress)కే జైకొట్టినా.. కొన్ని సంస్థలు మాత్రం అధికారం మరోసారి అధికార పార్టీ (BRS)దే అని తేల్చేశాయి. ఇక కొన్ని సంస్థలు మాత్రం రాష్ట్రంలో హంగ్‌ తప్పదని.. బీజేపీ (BJP) కింగ్‌ మేకర్‌గా మారే ఛాన్స్‌ ఉందని చెపుతుండడం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగుల హావ నడుస్తుంది. సంక్రాంతి పందేలను మించి..ఏపీలో బెట్టింగులు నడుస్తున్నాయి. బెట్టింగ్‌లకు ఫెమస్ అయినా భీమవరంలో కోట్లలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని భీమవరం, నరసాపురం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, తాడేపల్లిగూడెంతో పాటు విజయవాడ, గుంటూరు, విశాఖ, సత్తుపల్లి వంటి పట్టణాల్లో కోట్లలో బెట్టింగ్ రాయుళ్లు.. సై అంటే సై అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా లతో పాటు అమెరికా, ఇంగ్లండ్‌లోని ప్రధాన నగరాల నుంచి యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు జరుగుతున్నాయని వినికిడి. ఇలా బెట్టింగులు కాస్తున్నవారిలో రాజకీయ నేతలు, ఇండస్ట్రియలిస్ట్‌లతో పాటు.. బడా వ్యాపారులు, సామాన్యులు కూడా ఉన్నారు. ఓ పార్టీ గెలుపు.. లేదా కీలక నేత గెలుపు ఫై బెట్టింగ్‌ వేస్తసే.. లక్షకు రెండు లక్షలు, కోటికి రెండు కోట్లు అంటూ పర్సెంటేజీ నడుస్తోంది. బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్ కొడుతుందా? తొలిసారి కాంగ్రెస్‌ గెలుస్తుందా? అన్నదానిపై ప్రధానంగా బెట్లు కడుతున్నారని సమాచారం. అలాగే కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు అవుతారనేది దానిపై కూడా బెట్టింగులు కాస్తున్నారు. కామారెడ్డి, గజ్వేల్‌లో గెలుపెవరనేదానిపై చాలా మంది బెట్లు కడుతున్నారు. అటు కామారెడ్డి, గజ్వేల్‌ రెండు చోట్ల కేసీఆర్‌ గెలుస్తారా? లేదా అనేదానిపై కూడా భారీగా పందేలు ఆడుతున్నారు. ఇక కేసీఆర్‌, రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్‌ లాంటి కీలక నేతల మెజార్టీ మీద కూడా ఓ రేంజ్‌లో బెట్టింగులు జరుగుతున్నాయని అంటున్నారు. ఓవరాల్ గా మాత్రం తెలంగాణ ఫలితాలు..సంక్రాంతిని మించి బెట్టింగులు నడుస్తున్నాయి.

Read Also : Kodandaram: కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం చిన్నదేమీ కాదు : కోదండరామ్