Site icon HashtagU Telugu

CM Revanth: మన రాష్ట్రంలో ఉన్న మిమ్మల్ని ఎలా వదులుకుంటాం?: సీఎం రేవంత్‌

CM Revanth

CM Revanth

CM Revanth: హైదరాబాద్‌లో జరిగిన CREDAI ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేస్తూ తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుందని స్పష్టం చేశారు. పెట్టుబడిదారుల మనసుల్లో నెలకొన్న సందేహాలు, అపోహలను తొలగించే విధంగా ఆయన ప్రసంగం కొనసాగింది.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పాలసీ, కన్‌స్ట్రక్షన్ రంగాలను రాష్ట్ర అభివృద్ధికి రెండు గ్రోత్ ఇంజిన్‌లుగా భావిస్తుందని పేర్కొన్నారు. “పాలకులు మారినా, పాలసీ పెరాలసిస్‌కు తావు లేకుండా చూస్తున్నాం. దీనివల్లే మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం” అని ఆయన అన్నారు. పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా అవి లాభాలు తెచ్చేలా ప్రోత్సహించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని ఆయన హామీ ఇచ్చారు.

“ఇతర దేశాల పెట్టుబడిదారులను ఆహ్వానించే మేము, మన రాష్ట్రంలో ఉన్న మిమ్మల్ని ఎలా వదులుకుంటాం? పెట్టుబడుల విషయంలో మీకే మా మొదటి ప్రాధాన్యత” అని ఆయన రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులకు భరోసా ఇచ్చారు. కొందరు రాజకీయ నాయకులు సృష్టించే అపోహలకు లొంగి నష్టపోవద్దని ఆయన హెచ్చరించారు.

Also Read: CM Revanth Reddy: పెట్టుబడుల రక్షణకు కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్ రెడ్డి

తనను తాను “సగటు మధ్యతరగతి ఆలోచనలున్న ముఖ్యమంత్రి”గా అభివర్ణించుకున్న రేవంత్ రెడ్డి, తన విధానాలన్నీ ప్రజల శ్రేయస్సు కోసమేనని స్పష్టం చేశారు. “ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటా. కానీ అనుచిత డిమాండ్లకు మద్దతు ఇవ్వను” అని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ స్పష్టమైన, ధైర్యవంతమైన వ్యాఖ్యలు పెట్టుబడిదారులలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రభుత్వ పారదర్శక పాలసీలు, స్థిరమైన విధానాల వల్ల రాబోయే రోజుల్లో తెలంగాణలో పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి చూపుతున్న దిశ, పెట్టుబడిదారులకు కొత్త విశ్వాసాన్ని, తెలంగాణకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.