Hyderabad ORR : అమ్మ‌కానికి హైద‌రాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్డు

ఔట‌ర్ రింగ్ రోడ్డును 30ఏళ్ల పాటు లీజుకు ఇవ్వ‌డం ద్వారా 6వేల కోట్ల‌ను సంపాదించాల‌ని హెచ్ఎండీఏ ప్లాన్ చేస్తోంది

  • Written By:
  • Updated On - September 19, 2022 / 05:07 PM IST

ఔట‌ర్ రింగ్ రోడ్డును 30ఏళ్ల పాటు లీజుకు ఇవ్వ‌డం ద్వారా 6వేల కోట్ల‌ను సంపాదించాల‌ని హెచ్ఎండీఏ ప్లాన్ చేస్తోంది. 20ఏళ్ల‌కు లీజుకు ఇస్తే 4వేల కోట్లు, 30ఏళ్ల‌కు అయితే రూ. 6వేల కోట్లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తోంది. ప్రైవేట్‌ ఏజెన్సీకి దీర్ఘకాలిక లీజుకు ఇవ్వాలని హెచ్‌ఎండీఏ ప్రతిపాదించింది.

ప్రస్తుతం Eagle Infra India Limited ప్రతి నెలా టోల్ వసూలు చేస్తోంది. ఎలాంటి స‌వ‌ర‌ణ‌లు లేకుండా HMDAకి రూ. 24 కోట్లు పంపుతుంది. 2019-20లో రూ. 351 కోట్లు, 2020-21లో రూ. 310 కోట్లు, గత ఆర్థిక సంవత్సరంలో రూ. 421 కోట్లు పంపింది. దీర్ఘకాలిక లీజుకు సంబంధించిన విధివిధానాల కోసం, అవసరమైన పత్రాల తయారీ, బిడ్ ప్రక్రియ నిర్వహణ కోసం HMDA ఒక లావాదేవీ సలహాదారుని (TA) నియ‌మించ‌నుంది.

Also Read:   Telangana Elections : ఎన్నిక‌ల దిశ‌గా కేసీఆర్‌! క‌లెక్ట‌ర్ల‌కు `వారం` టార్గెట్లు!!

ORR ఆస్తులను మోనటైజేషన్ చేయడానికి HMDAతో పాటు సహాయం చేయడానికి మ‌రో కన్సల్టెన్సీని కోరతారు. లావాదేవీ సలహాదారుని (TA) ట్రాఫిక్ , రాబడి అంచనాలు, నిర్వహణ వ్యయం, నిర్వహణ, హైవే , పేవ్‌మెంట్ డిజైన్ ఆధారంగా నాణ్య‌త‌, రహదారి భద్రతా ఫీచర్లను పరిగణనలోకి తీసుకుంటుంది. ఎంపిక చేసిన ఏజెన్సీ టోల్ రుసుము వసూలు చేయడమే కాకుండా ట్రాఫిక్ నిర్వహణ మరియు భద్రతను చూడ‌నుంది. మౌలిక సదుపాయాల మరమ్మతు నిర్వహణ పనులను నిర్వహిస్తుంది. అంతేకాదు, ORRని పరిశీలించి, ఆక్రమణలను నిరోధించవలసి ఉంటుంది.ఇలా, స‌ర్వాధికారాల‌ను, బాధ్య‌త‌ల‌ను ప్రైవేటు ఏజెన్సీకి అప్ప‌గించ‌డానికి హెచ్ఎండీఏ సిద్ధం అయింది.

అధిక ఆదాయాన్ని ఆర్జించేందుకు టీఓటీ ప్రాతిపదికన ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టును మంజూరు చేసేందుకు మున్సిపల్‌ అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ మోడల్‌ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేస్తోది. మొత్తం మీద ఓఆర్ఆర్ ను దీర్ఘ‌కాలం లీజుకు ఇవ్వ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధం అయిందన్న‌మాట‌.