HMDA Artificial Demond : జ‌నం భూములు కేసీఆర్ ఇష్టం.! వేలంలో కృత్రిమ డిమాండ్!!

HMDA Artificial Demond : తెలంగాణ సీఎం కేసీఆర్ మాట‌కారి. తిమ్మిన‌బొమ్మిని చేయ‌గ‌ల‌రు. ఆయ‌న ఏది చెబితే అదే వేదం.

  • Written By:
  • Publish Date - August 10, 2023 / 05:09 PM IST

HMDA Artificial Demond : తెలంగాణ సీఎం కేసీఆర్ మాట‌కారి. తిమ్మిన‌బొమ్మిని చేయ‌గ‌ల‌రు. ఆయ‌న ఏది చెబితే అదే వేదం. `తెలంగాణ నా జ‌మానా..` అనే రీతిలో దూకుడుగా వెళుతున్నారు. రెండుసార్లు తెలంగాణ స‌మాజం ఆయ‌న్ను న‌మ్మింది. మూడోసారి కూడా నమ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈసారి రియ‌ల్ ఎస్టేట్ ధ‌ర‌ల‌ను చూపడం ద్వారా అధికారంలోకి రావాల‌ని చూస్తున్నారు. అందుకే, అసెంబ్లీలోనూ ఎక‌రం రూ. 100కోట్లు ప‌లికింద‌ని చెబుతూ దాన్నే ప్ర‌గ‌తిగా చూపాల‌ని మాస్ట‌ర్ ప్లాన్ వేశారు. ప‌క్కా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, కృత్రిమ డిమాండ్ ను క్రియేట్ చేస్తున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఆ మేర‌కు కాంగ్రెస్ లీడ‌ర్లు ఆరోప‌ణ‌ల‌కు దిగారు.

కృత్రిమ డిమాండ్ ను క్రియేట్ చేస్తున్నార‌ని కాంగ్రెస్ లీడ‌ర్లు (HMDA Artificial Demond)

ఒక‌ప్పుడు హైద‌రాబాద్ లో అంద‌రూ పెద్ద‌గా వ్య‌త్యాసం లేకుండా బ‌తికే ప‌రిస్థితి ఉండేది. ఇప్పుడు కేసీఆర్ జ‌మానా వ‌చ్చిన త‌రువాత ధ‌న‌వంతులు కుబేరులు అవుతున్నారు. పేద‌లు కూటి కోసం పాట్లుప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. ఎక‌రం వంద కోట్ల‌కు కొనుగోలు చేసే వాడితో పేదోడ్ని జ‌మ‌చేసి త‌ల‌స‌రి ఆదాయం దేశంలోనే తెలంగాణ నెంబ‌ర్ 1 అంటూ మోస‌కారి మాట‌లు చెబుతున్నార‌ని ఆర్థిక‌వేత్త‌ల అభిప్రాయం. హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌ల ఉండే భూముల‌ను వేలం వేస్తూ, లేని డిమాండ్ ను క్రియేట్ (HMDA Artificial Demond) చేస్తున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న ఆరోప‌ణ‌లు.

భూముల‌ను వేలం వేస్తూ, లేని డిమాండ్ ను క్రియేట్ 

ప్ర‌త్యేక ఉద్య‌మం జ‌రుగుతోన్న స‌మ‌యంలో ప్ర‌భుత్వ భూముల వేలాన్ని, పారిశ్రామివేత్త‌ల‌కు ఇవ్వ‌డాన్ని కేసీఆర్ అండ్ కో వ్య‌తిరేకించింది. ఇప్పుడు పూర్తిగా రివ‌ర్స్ లో కేసీఆర్ పాల‌న సాగుతోంది. ప‌క్కా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ దూకుడుగా వెళుతున్నారు. హైచ్ ఎండీఏను రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌గా మార్చేశారు. వేలంలో సొంత మ‌నుషుల ద్వారా టెండ‌ర్లు వేయిస్తున్నారు. బినామీ కంపెనీల‌తో వేలాన్ని ర‌క్తిక‌ట్టిస్తున్నారు. దాని ఫ‌లిత‌మే, ఎక‌రా రూ. 100 కోట్లు. ఇప్పుడు మూడు జిల్లాల్లో భూముల‌ను వేలం వేస్తూ అదే పంథాను (HMDA Artificial Demond) కొన‌సాగిస్తున్నార‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీల లీడ‌ర్లు చెబుతున్నారు.

Also Read : BRS Point : అసెంబ్లీలో రేవంత్ ప‌వ‌ర్, చంద్ర‌బాబు క‌ల్చ‌ర్

కోకాపేట ప్రాంతంలో సగటున ఎకరానికి రూ.73.23 కోట్లు ధర పలికింది. 45.33 ఎకరాలకు హెచ్​ఎండీఏ(HMDA) ఈ-వేలం నిర్వహించింది. ఈ-వేలంలో కనీస నిర్దేశిత ధర ఎకరానికి రూ.35 కోట్లు కాగా.. పదో నంబర్​ ప్లాట్​కు గరిష్ఠంగా రూ.100 కోట్లుకు పైగా ధర పలికిందని అధికారులు వెల్లడించారు. ఇదే ఊపులో రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో భూముల వేలానికి పెట్టారు. రంగారెడ్డిలోని బైరాగిగూడ, మంచిరేవుల, కోకాపేట్, నల్గండ్ల, బుద్వేల్, చందానగర్, పీరంచెరువు. మేడ్చల్-మల్కాజిగిరిలోని బాచుపల్లి, బౌరంపేట, చెంగిచెర్ల, సూరారం. సంగారెడ్డిలోని వెలిమల, నందిగాయ, అమీన్‌పూర్‌, పాతిగణాపూర్‌, కిష్టారెడ్డిపేటలో బ‌హిరంగ వేలం పెట్టారు.

కోకాపేట ప్రాంతంలో సగటున ఎకరానికి రూ.73.23 కోట్లు ధర (HMDA Artificial Demond)

కనీస ధర రూ. 12 వేలు, గరిష్ట ధర రూ. 65 వేలు. విస్టీర్ణం 302 చదరపు గజాల నుండి 8,591 చదరపు గజాల వరకు ఉంటుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిలా లేఅవుట్‌లో సోమవారం చేపట్టిన ప్లాట్ల ఈ-వేలానికి పెట్టుబడిదారుల.(HMDA Artificial Demond) నుంచి విశేష స్పందన లభించింద‌ని కేసీఆర్ స‌ర్కార్ న‌మ్మిస్తోంది. రెండు సెషన్ల ఈ-వేలం ముగిసే సమయానికి హెచ్‌ఎండీఏకు రూ. 121.40 కోట్లు, ఇది మూల విలువ కంటే మూడు రెట్లు ఎక్కువ. మోకిలా లేఅవుట్ యొక్క ఇ-వేలంలో చదరపు గజం ధర గరిష్టంగా రూ. 1, 05, 000కి చేరుకుందని ప్రకటన విడుద‌ల చేసింది.

సగటు ధర చదరపు గజానికి రూ. 80,397

సగటు ధర చదరపు గజానికి రూ. 80,397, దీని మూలాధార ధర కంటే దాదాపు మూడు రెట్లు అధిక విలువ రూ: 1, 05, 000 చదరపు గజానికి మరియు తక్కువ విలువ రూ. 72,000. మోకిలా లేఅవుట్ నార్సింగి-శంకరపల్లి రహదారికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో 165 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మొత్తం 50 ఓపెన్ ప్లాట్‌లను వేలానికి పెట్టారు. ప్లాట్ల పరిమాణం 300 చదరపు గజాల నుండి 500 చదరపు గజాల వరకు ఉంటుంది. సోమవారం వేలానికి ఉంచిన మొత్తం విస్తీర్ణం 15, 800 చదరపు గజాలు. ఇ-వేలం కోసం హెచ్‌ఎండీఏ (HMDA Artificial Demond)  నిర్ణయించిన అప్‌సెట్ ధర చదరపు గజానికి రూ. 25,000 మరియు అప్‌సెట్ ధర ఆధారంగా విక్రయించదగిన ప్రాంతం మొత్తం అంచనా విలువ రూ. 40 కోట్లు అని హెచ్‌ఎండీఏ ప్రకటనలో తెలిపింది, సానుకూల స్పందన కారణంగా పెట్టుబడిదారుల నుండి, మోకిలా లేఅవుట్ II వేలం త్వరలో చేపట్టబడుతుంది.

Also Read : TS Reality:మేడిపండులా KCR పాల‌న,తేల్చేసిన కాగ్

హైదరాబాద్ పరిధిలోని బుద్వేల్‌లో 100 ఎకరాల వేలానికి తెలంగాణ సర్కారు సిద్ధమైంది. దీనికి సంబంధించి గురువారం వేలం ప్రక్రియ కొనసాగనుంది. బుద్వేల్‌లో 14 ప్లాట్స్ ఈ-వేలానికి సన్నద్ధమైంది. ప్రభుత్వం నిర్దేశించిన కనీస ధర ఎకరానికి 20 కోట్లుగా ఉంది. ల్యాండ్ పార్శిల్ ప్యాకేజీలో మూడున్నర ఎకరాల నుంచి 14 ఎకరాల వరకు విక్రయించేందుకు సర్కారు నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో కేసీఆర్ బినామీ మ‌నుషులు టెండ‌ర్లు వేయ‌డం ద్వారా కృత్రిమ డిమాండ్ ను క్రియేట్ చేస్తున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపించే మాట‌.

Also Read : KTR Spot : రేవంత్ రెడ్డి చీక‌టి కోణంపై కేటీఆర్ ఫోక‌స్

వాస్త‌వంగా హైద‌రాబాద్ లోని టాప్ 20 రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలు క‌ల్వ‌కుంట్ల కుటుంబం ఆధీనంలో ఉన్నాయ‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీల లీడ‌ర్లు చెప్పే మాట‌. వాటి ద్వారా కొనుగోళ్ల‌ను చేయిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు రాజ‌పుష్ప కంపెనీ బీఆర్ఎస్ పార్టీ నేత‌కు చెందిన‌ది. ఆ కంపెనీ కోకాపేట భూముల‌ను ఎక‌రం 100కోట్ల‌కు తీసుకెళ్లింది. ప్ర‌స్తుతం రియ‌ల్ ఎస్టేట్ వాస్త‌వంగా డ‌ల్ గా ఉంది. మాంద్యం క్ర‌మంలో లావాదేవీలు జ‌ర‌గ‌డంలేదు. ప్ర‌పంచానికే వెన్నుముక‌గా ఉండే ఐటీ సెక్టార్ కుప్ప‌కూలింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో రియ‌ల్ ఎస్టేట్ పరిస్థితి దారుణంగా ఉంది. నిర్మాణ రంగం క‌దేలు అయింది. ఫ్లాట్ల‌ను విక్ర‌యించుకోలేని ప‌రిస్థితుల్లో బిల్డ‌ర్లు ఉన్నారు. కానీ, భూముల ధ‌ర‌ల‌ను ఆకాశానికి తీసుకెళ్లిన కేసీఆర్ ఫ‌క్తు వ్యాపారం దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని రియ‌ల్డ‌ర్ల అభిప్రాయం.