బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)పై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్‌లోని విభేదాలను, పార్టీ లోపల జరుగుతున్న కుమ్ములాటలను నియంత్రించలేని అసమర్థుడని తీవ్ర వ్యాఖ్యల చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీని బీఆర్ఎస్‌తో కలిసి దాడి చేస్తున్నట్లు ఆరోపణలు చేయడం రాజకీయంగా దివాళాకోరుతనమేనని ఆయన అన్నారు. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతోనే ప్రభుత్వాలు కూలిపోయాయని, అందులో బీజేపీ ప్రమేయం లేదని అన్నారు. కాంగ్రెస్ నేతలు కేవలం తమ రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ఇక కేబినెట్‌లో ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి భట్టి విక్రమార్క మధ్య విభేదాలు ఉన్నాయని, సీఎం రేవంత్ మూసీ నది ప్రక్షాళనపై లక్షన్నర కోట్ల వ్యయం అని చెప్పినా, డీపీఆర్ సిద్ధం కాలేదని భట్టి పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. అలాగే కాంగ్రెస్‌లో కొత్తగా చేరిన ఎమ్మెల్యేలకు స్వాగత కార్యక్రమంలో ఇతర మంత్రులు లేకపోవడం, కేబినెట్‌లో మొదటి నుంచి ఉన్న మంత్రులు, కొత్తగా వచ్చిన నేతల మధ్య విభజనలు పెరుగుతున్నాయని అన్నారు.
Read Also : Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 లో టైటిల్ ఛాన్స్ ఎవరికి ఉంది..!