Kavitha – Ram Mandir : అయోధ్య రామమందిరంపై కవిత ట్వీట్ వైరల్

Kavitha - Ram Mandir : జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతున్న వేళ దానిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక ట్వీట్ చేశారు.

  • Written By:
  • Publish Date - December 11, 2023 / 10:31 AM IST

Kavitha – Ram Mandir : జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతున్న వేళ దానిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక ట్వీట్ చేశారు.  ‘‘అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది కోట్లాది మంది హిందువుల కల సాకారమయ్యే శుభఘడియ’’ అని ట్వీట్‌లో ఆమె పేర్కొన్నారు. తెలుగులో చేసిన ఈ పోస్ట్ లో రామాలయం ప్రారంభోత్సవంపై కవిత తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘కోట్లాది మంది హిందువుల కల సాకారమైంది. అయోధ్యలో శ్రీ సీతారామ చంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన శుభ ముహూర్తం వచ్చేసింది. దీన్ని తెలంగాణతో పాటు దేశమంతా స్వాగతిస్తుంది’’ అని ఆమె(Kavitha – Ram Mandir) తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుతో పాటు నిర్మాణంలో ఉన్న రామమందిరం వీడియోను షేర్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ్-ప్రతిష్ఠ  వేడుకకు సంబంధించిన వైదిక ఆచారాలు జనవరి 16 నుంచే ప్రారంభమవుతాయి.ఈ వేడుకకు అన్ని వర్గాలకు చెందిన 4,000 మంది సాధువులను రామమందిరం ట్రస్ట్ ఆహ్వానించింది. అయోధ్యకు తరలివచ్చే వేలాది భక్తులకు వసతి కల్పించడానికి టెంట్ సిటీలు నిర్మిస్తున్నారు.

Also Read: 100 Lord Ram Idols : శ్రీరాముడి 100 విగ్రహాలతో అయోధ్యలో శోభాయాత్ర.. ఎప్పుడు ?