Site icon HashtagU Telugu

Temperature : వామ్మో దంచికొడుతున్న ఎండలు..103 ఏళ్ల రికార్డు బ్రేక్

Summer Vedi

Summer Vedi

వామ్మో ఏంటి ఈ ఎండలు (Temperature) అని ఇప్పుడు ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెతిస్తున్నాయి.. నిప్పుల కుంపటిలా వాతావరణం మారుతుంది. విపరీతమైన ఉక్కపోత, చెమటతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తెల్లవారడమే అధిక ఉష్ణోగ్రతలు High Temparatures నమోదవుతున్నాయి. సూర్యోదయం నుంచే వేసవి తీవ్ర కనిపిస్తోంది.

ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుండే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మొదలయ్యాయి. ఏప్రిల్ చివరి వారంలో అయితే మరింత ముదిరిపోయాయి. ఎంతలా అంటే 103 ఏళ్ల రికార్డు ను బ్రేక్ చేసాయంటే అర్ధం చేసుకోవాలి..ఏ రేంజ్ లో ఎండలు దంచికొడుతున్నాయో.. ఇక్కడ..అక్కడ అనే తేడాలు లేకుండా అనేక జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ వస్తున్నాయి. ఈ ఎండా వేడి తట్టుకోలేక ముసలి వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు వడదెబ్బ కు చనిపోతున్నారు. వచ్చే ఐదు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మరింత వేడెక్కుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. తూర్పు, దక్షిణ భారతదేశంలో అధిక తీవ్రతతో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. మే నెలలోనూ భానుడి ప్రతాపం కొనసాగుతుందని తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీలో చాపాడులో 45.9° డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా గూడూరులో 45.5° డిగ్రీలు, విజయనగరం జిల్లా రామభద్రపురంలో 45.2°డిగ్రీలు, పార్వతీపురంమన్యం జిల్లా మక్కువలో 45.1°డిగ్రీలు, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 45°డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇటు తెలంగాణ లో నల్గొండ జిల్లా మాగుడుల పల్లిలో 45.4 డిగ్రీలు, భద్రాద్రి కోత్తగూడెం జిల్లా అశ్వరావు పేట లో 45.3డిగ్రీలు,ములుగు జిల్లా మంగపేటలో 45.3డిగ్రీలు, భూపాలపల్లి జిల్లా రేగొండలో 45.2డిగ్రీలు, నల్గొండ జిల్లా వెంకటాపురంలో 45.1డిగ్రీలు, నల్గొండ జిల్లా ఎనుముల హాలియాలో 45.1డిగ్రీలు, కట్టంగూరులో 45.1డిగ్రీలు, త్రిపురారం, నాంపల్లిలో 45.1డిగ్రీలు, వరపర్తిలోని పన్‌గల్‌లో 45.1డిగ్రీలు, జగిత్యాల జిల్లా వెల్లటూరులో 45గ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో సోమవారం ఒక్క రోజే వడదెబ్బతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఇలా ఎండలు పెరిగిపోతున్న సమయంలో డాక్టర్లు ఎండల్లో బయటకు రాకూడదంటూ సూచిస్తున్నారు.

Read Also : Rice Water: అన్నం మాత్ర‌మే కాదు.. గంజి కూడా శ‌రీరానికి మేలు చేస్తుంద‌ట‌..!