వరంగల్‌లో మామునూరు ఎయిర్‌పోర్టు ( Mamunur Airport) నిర్మాణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళనకు (High tension) దిగారు. ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకించడం లేదని, అయితే తమకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని రైతులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా నక్కలపల్లి రోడ్డు మూసివేయడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ఎయిర్‌పోర్టు పరిధిలోకి వస్తుండటంతో, ప్రత్యామ్నాయ మార్గాన్ని కల్పించాలనే డిమాండ్ చేస్తున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ నిరసన ఉద్రిక్తతను పెంచారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భారీగా మోహరించడంతో ఆందోళన మరింత ఉద్రిక్తంగా మారింది.
Pithapuram : పిఠాపురంలో కాకరేపుతున్న రాజకీయాలు..ఎవరికీ మేలు..?
రైతులు తమ సమస్యలను అధికారులకు మరియు ప్రభుత్వ ప్రతినిధులకు తెలియజేసినా సరైన స్పందన లేకపోవడంతో చివరికి ధర్నా చేపట్టాల్సి వచ్చిందని వారంతా చెబుతున్నారు. ప్రభుత్వం మార్కెట్ విలువ మేరకు పరిహారం అందిస్తామని, లేదా ప్రత్యామ్నాయంగా వ్యవసాయ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని మంత్రులు హామీ ఇచ్చారని రైతులు గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ హామీలను అమలు చేయకుండా రైతులను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు మార్గం సమస్యకు ప్రభుత్వం ఆసక్తి చూపించకపోవడంతో, తమ గ్రామాలకు రాకపోకలు దెబ్బతింటాయనే భయంతో రైతులు ఆందోళన బాట పట్టారు.
Kejriwal : 10 రోజుపాటు ‘విపశ్యన’ ధ్యానంలో కేజ్రీవాల్
ప్రస్తుతం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు. హనుమకొండ ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, తహసీల్దార్ నాగేశ్వరరావు భూసేకరణ సర్వే కోసం అక్కడికి చేరుకోగానే, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అధికారులను నిలదీశారు. తమ భూములను తాకట్టుపెట్టిన ప్రభుత్వం ఇప్పుడు రోడ్డు మార్గాన్ని కూడా నిలిపివేయడం అన్యాయమని రైతులు మండిపడ్డారు. ఇక మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం, వరంగల్ అభివృద్ధికి కీలక మైలురాయిగా మారనుండగా, భూసేకరణపై సత్వర పరిష్కారం లేకపోవడం రైతుల ఆందోళనలకు కారణమవుతోంది. ఎయిర్‌పోర్టు రావడం అభివృద్ధికి సూచకమని రైతులు ఒప్పుకుంటూనే, తమ హక్కులను కాలరాయడం తగదని వాపోతున్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు సరైన పరిహారం అందించి, గ్రామాలకు అనుసంధానమయ్యే రహదారి మార్గాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజా సంఘాలు అంటున్నారు.