MLA Defection Case : బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు (Disqualification Of MLAs ) వేసేలా ఆదేశాలివ్వాలని బిఆర్ఎస్ , బీజేపీలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. స్పీకర్ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ పార్టీ, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు సోమవారం తీర్పు (High Court Verdict) తీర్పునిచ్చింది. నాలుగు వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతామంది.
ఇరుపక్షాల వాదనలు గత నెల 7వ తేదీన పూర్తయ్యాయి. తీర్పును తర్వాత వెలువరిస్తామని హైకోర్టు అప్పట్లోనే ప్రకటించింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAS) గత ఏప్రిల్ 24న దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు లోతుగా విచారించింది. బీఆర్‌ఎస్ తరఫున గెలిచి, కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం)పై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన దాఖలు చేయగా, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి మరొకరు పిటిషన్ దాఖలు చేశారు. ఆయా వ్యాజ్యాలపై వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది.
Read Also : Tamil Producer Dilli Babu Dies : నిర్మాత డిల్లీ బాబు మృతి